Baby Movie Heading Huge Collections : ‘బేబీ’ కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్లేనో…!
NQ Staff - July 18, 2023 / 07:43 PM IST

Baby Movie Heading Huge Collections :
ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి హీరోయిన్ గా నటించిన ‘బేబీ’ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. దాంతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కూడా మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు సాధించి ఆ తర్వాత కాస్త డ్రాప్ అవుతాయి. కానీ బేబీ కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు నుండి మంగళ వారం వరకు అదే జోరు కొనసాగుతూ ఉంది. వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా సినిమా రాబడుతున్న కలెక్షన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
‘బేబీ’ బ్రేక్ ఈవెన్..
బేబీ సినిమా ను ఎస్కేఎన్ నిర్మించిన విషయం తెల్సిందే. సినిమా ను అల్లు అరవింద్ సమర్పించిన నేపథ్యం లో భలే ఉందే అంటూ టాక్ వచ్చింది. అంతే కాకుండా సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
వైష్ణవి పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ట్రోల్స్ రావడంతో పాటు మీమ్స్ వస్తున్నాయి. ఈ సినిమా సోషల్ మీడియా సందడి చూస్తూ ఉంటే కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయో తెలియడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బేబీ కలెక్షన్స్ చూపు రూ.100 కోట్ల వైపు ఉందేమో అనే టాక్ వినిపిస్తుంది.