Babu Mohan: మా లో చీడ పురుగులు.. బాబు మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Babu Mohan: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఐదుగురు అధ్యక్ష ప‌దవికి పోటీ చేయ‌బోతున్నారు. ముందుగా ప్ర‌కాశ్ రాజ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నట్టు ప్ర‌క‌టించ‌గా, ఆ త‌ర్వాత మంచు విష్ణు, జీవిత‌, హేమ‌, సీవీఎల్ న‌ర‌సింహారావు పోటీలో నిలుస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే మా ఇష్యూస్‌పై ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు ప‌లు విధాలుగా స్పందిస్తున్నారు.

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్‌లో కొన్ని చీడ పురుగులు చేరి చెడగొడుతున్నాయని అన్నారు నటుడు బాబూ మోహన్. టాలీవుడ్‌లో మా ఎన్నిక‌లు వివాదాస్పదంగా మారడంతో ఆయ‌న ఈ హాట్ కామెంట్స్ చేశారు. ‘మా’ అంటే మా కుటుంబం అని ఇందులో జరిగే వాటిని ఎన్నికలుగా చూడమని చెప్పిన ఆయన.. కావాలనే కొంతమంది ‘మా’ని వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

‘మా’ ఎన్నికలు జరగడానికి ఇంకా టైం ఉంది.. నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ ఎన్నికలు పదిరోజుల హడావిడి మాత్రమే. అయితే ఆ మధ్య ‘మా’ అనేది బాగా వివాదం అవుతుంది. అది కొందరివల్ల మాత్రమే. చెడగొట్టే ఛీడపురుగులు అన్ని చోట్లా ఉంటాయి. అన్ని వృత్తులలోనూ ఈ ఛీడ పురుగులు ఉంటాయి.. అలాగే ‘మా’ వృత్తికి కూడా దాపరించింది. మా ఎల‌క్షన్స్‌ని త‌ప్ప‌క జ‌రిపించాలి. దీనిని మేం ఎల‌క్ష‌న్స్‌గా భావించం. ఇంటి ఎన్నిక‌లుగా మాత్ర‌మే చూస్తాం.

బ్ర‌ద‌ర్ లేదా సిస్ట‌ర్‌కి ఓటు వేస్తున్నాం అని భావిస్తాం. మా అనేది ఒక ఫ్యామిలీ. పొలిటికల్ స్టంట్లు ఏమీ ఉండవు. కాని కొంద‌రు మాలోకి దూరి చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చిరంజీవి, దాసరి లాంటి పెద్దలు ‘మా’ చెడగొట్టకుండా కాపాడారు. కానీ చీడ పురుగు తన ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు అని బాబు మోహ‌న్ పేర్కొన్నారు.