Sathyaraj : స‌త్య‌రాజ్ బాడీలో ఇన్‌ఫెక్ష‌న్ అధికంగా ఉందంటున్న వైద్యులు.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Sathyaraj : బాహుబ‌లి సినిమాలో క‌ట్ట‌ప్ప అనే పాత్ర‌లో ఒదిగిపోయిన న‌టుడు స‌త్య‌రాజ్. ఈ పాత్ర‌లో స‌త్య‌రాజ్ త‌ప్ప మ‌రే న‌టుడిని ఊహించ‌లేం అనే విధంగా ఆయ‌న న‌టించారు. తెలుగులో ఎన్నో ప‌వ‌ర్ ఫుల్ పాత్రలు పోషించిన స‌త్య‌రాజ్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అమింజిక్కరైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Baahubali Katappa actor Sathyaraj health update
Baahubali Katappa actor Sathyaraj health update

సత్యరాజ్ ప్రస్తుత వయస్సు 67 ఏళ్ళు. ఆయన వయసు రీత్యా ఏమవుతుందోనన్న భయం నెలకొంది. సత్యరాజ్ లేటెస్ట్ హెల్త్ కండీషన్ పై సమాచారం అందాల్సి ఉంది. ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

చెన్నైవ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం స‌త్య‌రాజ్ ఆరోగ్యం కొద్దిగా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెన్నై వర్గాలు తెలుపుతున్నాయి. త్వరలోనే ఆయన కోలుకోంటారని, తమవంతు ప్రయత్నం తాము చేస్తున్నామని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.

కట్టప్ప అభిమానులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్యరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి కట్టప్పగా… దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్న సత్యరాజ్, ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ లో సైతం కీలక రోల్ చేశారు.

అలాగే దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే మూవీలో సత్యరాజ్ కీలక రోల్ చేశారు. సాయి ధరమ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఇక సత్యరాజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.