Avika Gor : టాలీవుడ్ లో నెపోటిజం చాలా ఎక్కువ.. స్టార్ హీరోలపై అవికాగోర్ సంచలనం..!

NQ Staff - June 13, 2023 / 11:24 AM IST

Avika Gor : టాలీవుడ్ లో నెపోటిజం చాలా ఎక్కువ.. స్టార్ హీరోలపై అవికాగోర్ సంచలనం..!

Avika Gor : టాలీవుడ్ మీద ఎప్పటి నుంచో కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో బలంగా ఉంది మాత్రం నెపోటిజం. అవును.. మన తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న వారంతా ఇప్పుడు స్టార్ వారసులు కొడుకులే. వారే స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. కాగా ఇదే విషయంపై ఇప్పటికే చాలామంది హీరోలు గట్టిగా ప్రశ్నించారు.

అప్పట్లో హీరోయిన్లు కూడా ఇదే విషయాన్ని తరచూ వినిపించారు. ఇప్పుడు చిన్నారి పెండ్లి కూతురుగా పేరు తెచ్చుకున్న అవికాగోర్ కూడా ప్రశ్నించింది. ఆమె ఇప్పటికే తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సౌత్ లో నెపోటిజం అనేది చాలా ఎక్కువ. అందులోనే టాలీవుడ్ లో ఇది చాలా ఎక్కువగా ఉంది. కానీ అక్కడ ప్రేక్షకులు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ హిందీలో ప్రేక్షకులు అలా చూడరు. తెలుగులో స్టార్ హీరోలను బేస్ చేసుకునే సినిమాలు వస్తుంటాయి.

హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇప్పుడు తెలుగులో కూడా ఇదే జరుగుతోంది. తర్వాత రోజుల్లో అయినా ఇది మారుతుందేమో అని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది అవికాగోర్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ కు వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం బాగా అలవాటు అయిపోయిందని అంటున్నారు ఇక్కడ ప్రేక్షకులు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us