Avika Gor :వైట్ అండ్ వైట్‌లో సెగ‌లు రేపుతున్న అవికా గోర్

Avika Gor :చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది అవికా గోర్ . రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అవికా. ఈ సినిమాలో అవికా ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంత్ర ముగ్ధుల‌య్యారు. అయితే అవికాకి సరైన హిట్ పడకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది .

Avika Gor Hot looks in white dress
Avika Gor Hot looks in white dress

తెలుగుతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇటీవల జీ5 ఓటిటిలో రిలీజ్ అయిన ‘నెట్’ అనే వెబ్ సినిమాతో అందర్నీ అలరించింది. ఇటీవలే తనకి కాబోయే భర్తని కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఈ భామ ఇప్పుడు నిర్మాతగా మారనుంది.

Avika Gor Hot looks in white dress
Avika Gor Hot looks in white dress

అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించడానికి సిద్ధమైంది. ఈ బ్యానర్ లో తొలి సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. నిర్మాతగా తన తొలి సినిమా ఇటీవల 10 రోజుల‌పాటు గోవాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా గోవాలో దిగిన ఫోటోని షేర్ చేస్తూ… నిర్మాతగా నా తొలి చిత్రం నాకు అమేజింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది అని పేర్కొంది.

Avika Gor Hot looks in white dress
Avika Gor Hot looks in white dress

వెండితెర, బుల్లితెరలపై రాణిస్తున్న అవికా.. ఒకానొక సమయంలో బొద్దుగా మారి అవ కాశాలు కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు క్రమంగా నాజూకు లుక్ లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే అవికా తల్లయిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మనీష్ తనకు మంచి స్నేహితుడని, అలాంటి వ్యక్తిని ముడిపెట్టి మా ఇద్దరిపై గాసిప్స్ రాయడం తీవ్రంగా బాధ పెట్టాయని ఆమె పేర్కొంది.

Avika Gor Hot looks in white dress
Avika Gor Hot looks in white dress

సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ ఉండే అవికా గోర్ రీసెంట్‌గా వైట్ అండ్ వైట్‌లో ర‌చ్చ చేసింది. అవికా ఏంజెల్ మాదిరిగా క‌నిపిస్తుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్‌కి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది.