Australia: 34 బంతుల్లో సెంచ‌రీ, అదీ టెస్ట్ మ్యాచ్‌లో…

Tech Sai Chandu - October 25, 2021 / 03:33 PM IST

Australia: 34 బంతుల్లో సెంచ‌రీ, అదీ టెస్ట్ మ్యాచ్‌లో…

Australia: టీ 20 ఫార్మాట్ వ‌చ్చాక ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. డిఫెన్స్ ఆడ‌డం అనేది క‌నిపించ‌డం లేదు.బ్యాట్స్‌మెన్స్ అయితే బంతిని బ‌లంగా కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌ప్పుడు సెంచ‌రీ చేయాలంటే ఆపసోపాలు ప‌డేవారు. కాని ఇప్పుడు 50 బంతుల లోపే ఆడి సెంచ‌రీ కొట్టేస్తున్నారు.

Australia

టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) పేరిట ఉండగా.. వన్డేల్లో ఏబీ డివిలియర్స్(31 బంతుల్లో) ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టుల్లో న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌(54 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వ‌ర‌కు ఇదే అత్యుత్తమ రికార్డుగా చెబుతున్నారు. కాని 39 ఏళ్ల క్రితం 34 బంతుల్లోనే సెంచరీ చేసిన రికార్డ్ ఉంది. అది చాలా మందికి తెలియ‌దు.

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హుక్స్ ఎడమ చేతి బ్యాట్స్‌మన్. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో విక్టోరియాపై తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున బ్యాటింగ్‌కు దిగిన హుక్స్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే.. విక్టోరియా విధించిన 270 పరుగుల చేయాలి. అది కూడా 30 ఓవర్లలో చేధించాలి.

ఈ పరిస్థితిలో బ్యాటింగ్‌కు దిగిన హుక్స్.. 55 నిమిషాల్లో మొత్తంగా 107 పరుగులు సాధించాడు. 34 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.

డేవిడ్ హుక్స్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 23 టెస్టులు ఆడాడు. మొత్తంగా 34.36 సగటుతో 1306 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక తన కెరీర్‌లో 178 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన హుక్స్.. 43.99 సగటుతో 12671 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 306 నాటౌట్. 32 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us