Taraka Ratna: తార‌క‌ర‌త్న బంధువుల క‌ళ్ల‌లో కారం కొట్టి దాడి.. అవ‌న్నీ పుకార్ల‌ని వెల్ల‌డి

నంద‌మూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత సరైన స‌క్సెస్‌లు లేక‌పోవ‌డంతో సైలెంట్‌గా ఉన్న న‌టుడు తార‌క‌ర‌త్న‌. ఈ మ‌ధ్య స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా ట్రై చేశాడు. అవి స‌త్ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఇదిలా ఉంటే తార‌క‌ర‌త్న బంధువుల‌పై గుర్తు తెలియ‌ని వ్యక్తులు దాడి చేసిన‌ట్టు ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని సాగ‌ర్ సొసైట్ ప్లాట్ నెంబ‌ర్ 35లో బెజవాడ బాల‌కృష్ణ‌(33) అద్దెకు ఉంటున్నాడు. శుక్ర‌వారం ఉద‌యం త‌న సోద‌రుడు ఎం.కృష్ణాత్మ అనే ఈవెంట్ మేనేజ‌ర్‌తో క‌లిసి టీ తాగుతున్నాడు.

టీ తాగుతున్న స‌మ‌యంలో ఆగంతకులు ఇంట్లోకి ప్ర‌వేశించి ఇద్ద‌రి క‌ళ్ల‌లో కారం పొడి చ‌ల్లారు. కర్ర‌ల‌తో తీవ్రంగా కొట్టి అక్క‌డి నుండి ప‌రార‌య్యారు ఈ దాడిలో కృష్ణాత్మ త‌ల‌, చేతుల‌కు తీవ్ర‌మైన గాయాలు కావ‌డంతో ఆసుప‌త్రిలో చేరారు. కాస్త కోలుకున్న త‌ర్వాత ఆయ‌న తార‌క‌ర‌త్న‌తో క‌లిసి పోలీసులకు ఫిర్యాదు చేశార‌ని, దాడి చేసిన వారు 30 నుండి 35 ఏళ్ల వ‌య‌స్సు వారై ఉంటార‌ని అన్నారు. అయితే దాడిలో గాయ‌ప‌డ్డ వారు తార‌క‌రత్న‌కు కాని నంద‌మూరి ఫ్యామిలీకి కాని ఎలాంటి రిలేషన్ షిప్ లేద‌ని వెల్ల‌డైంది. అస‌లు ఈ పుకారు ఎలా వ‌చ్చిందో అర్ధం కావ‌డం లేదు అంటూ తార‌క‌ర‌త్న స‌న్నిహితులు అంటున్నారు.

Advertisement