ATM: టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్‌గా రూపొందిన హరీష్ శంకర్ త్వరలో వెబ్ సిరీస్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఆయన దిల్ రాజుతో కలిసి ఏటీఎం పేరుతో వెబ్ సిరీస్ చేయనున్నాడు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. రాబరీ బిగిన్స్ సూన్’ (దోపిడీ త్వరలో మొదలు అవుతుంది) అని ఆ పోస్టర్ మీద పేర్కొన్నారు. అలాగే, ‘దొంగతనం పక్కా’ అంటూ మరో సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఎటిఎం దోపీడీ ఆధారంగా హరీష్ శంకర్ థ్రిల్లింగ్ కథ రాసినట్టు తెలుస్తోంది. సి. చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే రాయడంతో పాటు దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌ను ‘జీ 5’ ఓటీటీ కోసం రూపొందిస్తున్నారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, హరీష్ శంకర్ .ఎస్ నిర్మిస్తున్న ఒరిజినల్ సిరీస్ ఇది.
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, సూపర్ డూపర్ హిట్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్‌ది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘డీజే – దువ్వాడ జగన్నాథం’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి మరోసారి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అయితే… అది సినిమా కాదు, ఓ వెబ్ సిరీస్. దానికి హరీష్ శంకర్ రచయిత. అలాగే, నిర్మాత కూడా. ఈ వెబ్ సిరీస్‌పై అందరిలో అంచనాలు ఉన్నాయి.
హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్ అనే సినిమా చేసందుకు సిద్ధమయ్యాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఈ సినిమాలో ఇప్పటికే తాను రెండు పాటలను కంపోజ్ చేసేశానని అన్నాడు దేవీ. ఇందులో పాటలు ఎనర్జిటిక్‌గా, మెలోడియస్గా ఉంటాయన్నాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభవుతుందని గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే భవదీయుడు భగత్‌సింగ్ పాటలు గబ్బర్‌సింగ్‌ను మించిపోయేలా ఉంటాయని అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు పవన్ అభిమానులు