KL Rahul : కేఎల్ రాహుల్‌తో కొత్త ఇంటికి మకాం మార్చిన హీరో ముద్దుల తనయ
NQ Staff - August 24, 2022 / 08:54 AM IST

KL Rahul : బాలీవుడ్ నటీమణులు, క్రికెటర్స్‌తో ప్రేమాయణం నడపడం కొత్తేమి కాదు. అప్పటి జనరేషన్స్‌తో పాటు ఇప్పటి జనరేషన్‌లోను ఇది జరుగుతుంది.అయితే కొన్నాళ్లుగా భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Athiya Shetty moved to a new house with KL Rahul
కొత్త ఇంటికి షిఫ్ట్..
ప్రస్తుతం ఇద్దరూ లివింగ్‌లోనే ఉన్నారు. తాజాగా అతియా శెట్టి.. తన బాయ్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్‌తో కలిసి నూతన ఇంటికి మకాం మార్చిందని సమాచారం. ముబయి కార్టర్ రోడ్డులోని సీ పేసింగ్ ఇంటికి రాహుల్, అతియా మారినట్లు తెలుస్తోంది. ఈ నూతన ఇంటి గృహప్రవేశం కూడా ఇటీవలే పూర్తియినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇరువురి తల్లిదండ్రులు నిర్వహించారట.
ఇకపై వీరిద్దరూ ఇక్కడే నివాసముండబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఇక్కడే ఏకాంతంగా, ఆనందంగా గడిపేలా ఈ జోడీ ప్లాన్ చేసుకుందట. అతియా తన వివాహ బాధ్యతలను పూర్తిగా తన తండ్రి సునీల్‌కే అప్పజెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన స్పందించారు. “ఈ విషయంలో వారు ఏం చేయాలనుకుంటున్నారో వారిష్టం. కాలం మారినందున వారే నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి” అని సునీల్ శెట్టి స్పష్టం చేశారు.
గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్-అతియా శెట్టి ప్రేమలో ఉన్నప్పటికీ.. తమ బంధం గురించి ఇప్పటి వరకు బహిర్గత పరచలేదు. తాము సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. కలిసి చెట్టాపట్టాలేస్తూ ఉన్నప్పటికీ ఏ నాడు ప్రకటించలేదు. వారి ప్రవర్తనను బట్టే ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు.