Athidi agarwal : అతిథి అగర్వాల్ అప్పట్లో గంగోత్రి సినిమాలో చేసిన హీరోయిన్ ఇప్పుడు ఎలాంటి జీవితం గడుపుతోందో తెలుసా పాపం ?

Athidi agarwal : అతిథి అగర్వాల్ అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుల గా నటించిన పిల్లలు ఇప్పుడు హీరో.. హీరోయిన్స్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి రాశి, ఆలీ, తరుణ్, మహేష్ బాబు, శాలినీ, శామిలీ… ఇలా ఎంతో మంది బాల నటులగా పేరు తెచ్చుకొని అలాగే పెద్దయ్యాక హీరో.. హీరోయిన్స్ గా పాపులర్ అవుతున్నారు. ఇంద్ర సినిమాలో నటించిన తేజ సజ్జ కూడా ఇప్పుడు జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారాడు. ఇక అఖిల్ అక్కినేని నెలల బాబు గా ఉన్నప్పుడే సిసీంద్రి సినిమాలో కనిపించాడు. కథ మొత్తం ఆ చంటి పిల్లాడి చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు అఖిల్ హీరోగా మారి 4 వ సినిమాతో రాబోతున్నాడు.

athidi-agarwal-once-upon-a-heroine-now-how-is-she-spending-her-life
athidi-agarwal-once-upon-a-heroine-now-how-is-she-spending-her-life

అయితే చైల్డ్ ఆర్టిస్టుల గా ఉన్న పాపులారిటీ కొందరికి హీరో.. హీరోయిన్ అయ్యాక రాదు. ఇక స్టార్ హీరో.. లేక హీరోయిన్ చెల్లి.. తమ్ముడు.. ఇలా కొంతమంది వెండి తెరకి పరిచయం అవుతుంటారు. కాని అందరికీ ఒకే రకమైన క్రేజ్ రావడం మాత్రం చాలా కష్టం. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఆర్తి అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడమే విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో కి జంటగా నటించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. రవితేజ.. మహేష్ బాబు.. ప్రభాస్ .. రవితేజ.. నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగింది.

Athidi agarwal : అతిథి అగర్వాల్ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

అయితే అర్థాంతరంగా ఆర్తి అగర్వాల్ కెరిర్ ముగుసిపోయింది. కాగా ఈ స్టార్ హీరోయిన్ కి చెల్లెలు అతిథి అగర్వాల్ కూడా సినిమాల కోసం ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన డెబ్యూ సినిమా గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో పాటు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలో అవకాశం వచ్చింది. కాని ఆ సినిమాలని ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడం ఇంతలో అక్క ఆర్తి అగర్వాల్ చనిపోవడం తో కలత చెందిన అతిథి అగర్వాల్ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

Advertisement