Asin: క‌థ‌క్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అసిన్ కూతురు.. పిక్ వైర‌ల్

Samsthi 2210 - June 14, 2021 / 03:21 PM IST

Asin: క‌థ‌క్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అసిన్ కూతురు.. పిక్ వైర‌ల్

Asin: అసిన్.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. మ‌ల‌యాళీ అమ్మాయి అయిన అసిన్ తమిళ అమ్మాయిగా ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుంది. ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక’ అనే మలయాళ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కేర‌ళ కుట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మ..నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అమ్మ.. నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాలో అసిన్ న‌ట‌న ప్రేక్ష‌కులల‌కి స‌రికొత్త వినోదాన్ని అందించింది. త‌మిళ అమ్మాయిగా అసిన్ క‌న‌బ‌రచిన న‌ట విన్యాసం ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో నిలిచింది ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా బడా హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేశింది. ఆ తర్వాత తెలుగులో ‘ఘర్షణ’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహా’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. తమిళంలో జయం రవి నటించిన ‘ఎం. కుమారన్ స‌న్నాఫ్ మహాలక్ష్మి’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆపై అక్క‌డ బ‌డా హీరోల స‌ర‌స‌న ఆడిపాడింది.

గజినీ సినిమాతో బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారిన అసిన్ 2016 జనవరిలో తన బాయ్ ఫ్రెండ్, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను పెళ్లాడింది. ఇక 2017 అక్టోబర్ 24న పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిన స‌మ‌యంలో అసిన్ ఆమె భ‌ర్త ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఫ‌స్ట్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కూతురి ఫొటో షేర్ చేసిన అసిన్ ఇక అప్ప‌టి నుండి వ‌రుస ఫొటోలు రిలీజ్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది.

అసిన్ కూతురి పేరు అరిన్ కాగా, ప్ర‌స్తుతం ఈ చిన్నారి క‌థ‌క్ నేర్చుకుంటుంద‌ట‌. కూతురు అరిన్ ఫొటోని షేర్ చేస్తూ.. ఎంతో డెడికేష‌న్‌తో క‌థ‌క్ నేర్చుకుంటుంద‌ని కామెంట్ పెట్టింది. కాగా, అసిన్ కూడా మంచి డ్యాన్సర్ అన్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. భ‌ర‌త నాట్యంలో అసిన్‌కు మంచి ప‌ట్టు ఉంది. అసిన్‌ని తిరిగి సినిమాల‌లోకి రావాల‌ని ఆమె అభిమానులు కోరుతుండ‌గా, అసిన్ దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us