Ashu Reddy : పవన్ మోజులో ఉద్యోగం ఊడగొట్టుకున్న అషు రెడ్డి.! ఇంకెవరూ ఆ తప్పు చేయొద్దు.!
NQ Staff - January 6, 2023 / 06:42 PM IST

Ashu Reddy : తమిళనాడులో రజనీకాంత్‌కి ఏ స్థాయిలో ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ సినిమా విడుదల రోజు, అక్కడ కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రత్యేక సెలవు దినాన్ని ఇస్తుంటాయి తమ ఉద్యోగులకి. అలా ఉద్యోగులు ఆయా కంపెనీలను అభ్యర్థిస్తుంటారు.
మన తెలుగు నాట పవన్ కళ్యాణ్‌కి ఆ స్థాయి క్రేజ్ వుంది. 2017 సంవత్సరంలో జరిగిన ఓ సంఘటన గురించి బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి తాజాగా పేర్కొంది. సెలవు కావాలని కంపెనీకి లెటర్ రాసిపెట్టి, ప్రీమియర్ షోకి వెళ్ళాననీ, ఆ రోజే తన ఉద్యోగం పోయిందని అషు రెడ్డి చెప్పుకొచ్చింది.
తప్పు చేశావ్..
అషు రెడ్డి, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఆ అభిమానంతోనే, సీక్రెట్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ పేరుని టాట్టూగా వేయించుకుంది. పక్కటెముకల ప్రాంతంలో వుంటుంది.
అయినాగానీ, పవన్ మీద అభిమానంతో ఉద్యోగం ఊడగొట్టుకోవడం, పైగా దాన్ని గొప్ప పనిగా చెప్పుకోవడం.. తగదంటూ అషు రెడ్డికి సూచిస్తున్నారు కొందరు నెటిజన్లు. ‘నువ్వు సెటిల్ అయిపోయావ్.. కానీ, చాలామందికి అలాంటి అవకాశం వుండదు. ఇలాంటి చెత్త మాటలు చెప్పొద్దు..’ అంటూ అషు రెడ్డికి సూచిస్తున్న నెటిజన్లు, ‘ఆమె మాట విని ఎవరూ కెరీర్‌ని పాడు చేసుకోవద్దు..’ అంటూ పవన్ అభిమానులకూ క్లాస్ తీసుకుంటున్నారు.