Ashu Reddy: అషూ రెడ్డి అంద చందాల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

Ashu Reddy: బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషూ రెడ్డి నెటిజన్లకు ఇచ్చే కామెంట్లతో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్, రాహుల్ సిప్లిగంజ్ విషయంలో అషూ ఎంతటి ట్రోలింగ్‌ను ఎదుర్కొందే అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి.. సినిమాల్లో చాలా తక్కువగా నటించారు. బిగ్ బాస్ షో కంటే ముందుగానే ఛల్ మోహన రంగ అనే సినిమాలో కనిపించారు. బిగ్ బాస్ షో అనంతరం అంతగా సినీ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి హీరోయిన్‌గా రాబోతోన్నారు.

Ashu Reddy

విజయ్‌ శంకర్‌ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్‌గా స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ ‘ఫోకస్‌’ అనే సినిమాను చేస్తున్నారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్ర‌ముఖ న‌టి సుహాసిని మ‌ణిర‌త్నం కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో అషూకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేప‌థ్యంలో ఆమె గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స్టైలిష్ డ్రెస్సుల‌లో ఎద అందాలు ఆరబోయ‌డం లేదంటే తొడ అందాల‌తో ర‌చ్చ చేస్తూ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుది.