Ashu Reddy : దుబాయ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆర‌బోసిన అషూ రెడ్డి

Ashu Reddy : బిగ్ బాస్ షోతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. ఫలితంగా ఇప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది విశాఖపట్నం అమ్మాయి నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర‌ల తొలిసారి వెండితెర‌పై న‌టించింది.

Ashu Reddy latest photo shoot
Ashu Reddy latest photo shoot

సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురై బొద్దుగా మారిపోయింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అషు రెడ్డి పేరు మారుమ్రోగిపోడానికి సోషల్ మీడియానే కారణం.

Ashu Reddy latest photo shoot
Ashu Reddy latest photo shoot

స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కామెడీ స్టార్స్’ అషు రెడ్డి రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల లైవ్ చాట్‌లో హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అయినప్పటికీ తరచూ అనుమానాలు రేకెత్తేలా వ్యవహరిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

Ashu Reddy latest photo shoot
Ashu Reddy latest photo shoot

అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి ‘హ్యాపీ డేస్’ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో మొదట రవితో, ఇప్పుడు నిఖిల్‌తో కలిసి కలిసి ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, స్టూడెంట్స్‌తోనూ ఓ రేంజ్‌లో ఆడుకుంటూ హైలైట్ అవుతోంది.

Ashu Reddy latest photo shoot
Ashu Reddy latest photo shoot

సోష‌ల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. అలాగే, అందాలు ఆరబోస్తూ దిగిన వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. ఇలా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

Ashu Reddy latest photo shoot
Ashu Reddy latest photo shoot

రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ దుబాయ్ వెళ్లింది. అక్క‌డ తెగ ర‌చ్చ చేస్తుంది. అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంది. తాజ‌గా స్విమ్మింగ్ పూల్‌లో చీర‌క‌ట్టుకొని దిగి త‌డి అందాల‌తో ర‌చ్చ చేస్తుంది. అషూ పిక్స్ చూసి అభిమానుల మ‌తులు పోతున్నాయి.