Ashu Reddy: అషూ రెడ్డి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ముందు జూనియర్ సమంతగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెరపై తెగ సందడి చేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయడంతో పాటు రాహుల్ సిప్లిగంజ్, ఎక్స్‌ప్రెస్ హరిలతో రొమాన్స్ తెగ పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో అషూ రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డి వ్యవహారం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లైన ఈ ఇద్దరూ షో తరువాతే అసలు కథను మొదలుపెట్టేశారు. బయటకు వచ్చాక రాహుల్ అషూ రెడ్డి జంట దుమ్ములేపింది. ఈ ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, అక్కడ ఎంతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరిపై రూమర్లు పుట్టుకొచ్చాయి.
రాహుల్ అషూరెడ్డిలు ప్రేమలో ఉన్నారంటూ.. పెళ్లి చేసుకోబోతోన్నారంటూ వార్తలు వచ్చాయి. రాహుల్‌తో వ్యవహారంకి సంబంధించి అషూ ఎప్పుడు హెడ్ లైన్స్‌లో నిలుస్తూనే ఉంటుంది. అయితే అషూని ఎంతగానో అభిమానించే వీరాభిమాని ఒకరు ఆమెపై తనకున్న ప్రేమని వ్యక్త పరుస్తూ అషూ అని చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీని పక్కనే ఎర్ర గులాబీ పువ్వును కూడా ముద్రించుకున్నాడు.
టాటూ చూసి షాకైన అషూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే ఎమోషనల్ అయింది. “ఓ మై గాడ్.. థాంక్యూ సో మచ్.. నిజంగా నాకు సంతోషంతో కన్నీళ్లొచ్చేస్తున్నాయి” అంటూ దండం పెడుతున్న ఎమోజీని జత చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అషూ ఇటీవల తన ఇన్‌స్టాలో అమ్మకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు లక్షల హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా అందుకున్న అషూ తానే కొనుకున్నానని చెప్పడంతో అషూ తల్లి ఆమెపై గరంగరం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది.