Ashu: గుండెల‌పై అషూ పేరు..చెంప చెళ్లుమ‌నిపించిన జూనియ‌ర్ స‌మంత‌

Ashu: జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో మ‌రింత పాపులారిటీ ద‌క్కించుకుంది. పవన్ కళ్యాణ్ వ్యవహారం, రాహుల్ సిప్లిగంజ్‌తో ట్రాక్, బుల్లితెరపై కామెడీ షోలు, అందులో స్పెషల్ ట్రాక్ ఇలా మొత్తానికి అషూ రెడ్డి మాత్రం నిత్యం ట్రెండింగ్‌లో ఉంటారు. అయితే బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అషూ ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతుంద‌నే టాక్ న‌డుస్తుంది.

ఈ మ‌ధ్యే రాహుల్ ..అషూని ఎత్తుకున్న ఫొటోని షేర్ చేస్తూ స‌ర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అని చెప్పి దానికి ల‌వ్ సింబ‌ల్ యాడ్ చేశాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ బాగానే ముదిరి ఉంటుంద‌ని కొంద‌రు భావించారు. మ‌రోవైపు కమెడియన్‌ ఎక్స్‌ప్రెస్ హరితో కూడా ఈ అమ్మ‌డు ఏదో న‌డిపిస్తుంద‌నే టాక్స్ న‌డుస్తున్నాయి. అషూని ఇంప్రెస్ చేసేందుకు హ‌రి ఏవేవో చేస్తుండ‌డం మ‌నం చాలా సార్లు చూశాం.

తాజాగా హ‌రి త‌న గుండెల‌పై అషూ పేరుని ప‌చ్చ బొట్టుగా వేయించుకొని ఇది ఇక నా గుండెల‌పై శాశ్వ‌తంగా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. ‘నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే..ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత’ అంటూ హరి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేశాడు. దీంతో ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్‌ కోసం చేశావా అని అడగ్గా..నిజంగానే పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెప్పాడు.

హ‌రి మాట‌ల‌కు ఒళ్లు మండిన అషూ అత‌ని చెంప చెళ్లుమ‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. అయితే ఇది టీఆర్పీ రేటింగుల కోసమే ఆడిన డ్రామా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్రోగ్రాంపై ఆస‌క్తి పెంచేందుకు పెళ్లిళ్లు చేసుకున్న‌ట్టు న‌టించ‌డం, ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు ఏవో వార్త‌లు వ‌ద‌ల‌డం అన్నీ చేస్తుండ‌గా, ఇవి నెటిజ‌న్స్‌కి చిరాకు తెప్పిస్తున్నాయి.