Ashish Gandhi: ఇష్టపడిన అమ్మాయితో యంగ్‌ హీరో వివాహం..!

Ashish Gandhi: టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్‌ గాంధీ సీక్రెట్‌గా వివాహం చేసుకొని తన అభిమానులను అశ్చర్యపరిచాడు. ఓ స్త్రీ రేపురా, శ్రీ శ్రీ, నాటకం, ఓ మై గాడ్, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్2‌, హ్యాపీ జర్నీ తదితర సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆశిష్‌. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్‌.. తనను ఇష్టపడిన అమ్మాయినే పరిణయమాడాడు.

Ashish Gandhi Ties The Knot With Nikitha
Ashish Gandhi Ties The Knot With Nikitha

వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరైన నికితతో నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఆశిష్‌ వివాహం నిరాడంబరంగా జరిగింది. కోవిడ్‌ నియమ నిబంధనల నేపథ్యంలో చాలా కొద్దిమంది సమక్షంలో వీరి వివాహవేడుక జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇరు కుంటుంబాల పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం జరగడం విశేషం.

తన పెళ్లి గురించి ఆశిష్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో నికిత నన్ను చూసిందట. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఫంక్షన్‌లో నా కదలికలను గమనిస్తూనే ఉందట. నా బిహేవియర్‌ నచ్చి అప్పటినుంచే నన్ను ప్రేమించడం మొదలెట్టిందట. ఈ విషయాలన్నీ నికితనే తనకు చెప్పడంతో చాలా థ్రిల్‌ ఫీలయ్యానన్నాడు ఈ యువ నటుడు. ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి జరగడంతో చాలా సంతోషంగా ఉందన్నారు.

సాధారణంగా సినిమా వాళ్లను పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది సంకోచిస్తారు. లేనిపోని అనుమానాలు పెంచుకుంటారు. కానీ, నికిత అవన్నీ పట్టించుకోలేదు. నా వ్యక్తిత్వాన్ని చాలా బాగా అర్థం చేసుకుంది. తన ఆలోచనలు కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇంత మంచి అమ్మాయి తన జీవితంలోకి అడుగుపెట్టడంతో తన ఆనందానికి అవధులు లేవన్నాడు ఆశిష్‌.

నికిత కూడా తన వివాహం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ప్రేమించిన అబ్బాయితోనే వివాహం జరగడం, అందుకు ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఫుల్‌ ఖుషయ్యానంది. ఆశిష్‌ వ్యక్తిత్వం, మాటతీరు నన్ను కట్టిపడేశాయని నికిత తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా ఆశిష్‌ను గమనిస్తున్నాననీ.. ఇలాంటి వ్యక్తిని అస్సలు మిస్‌ చేసుకోకూడదని అప్పుడే ఫిక్సయ్యానని తెలిపింది నికిత. ఇందుకు తమ తల్లిదండ్రులు కూడా అంగీకరిండం చాలా సంతోషమని తెలిపింది ఈ నూతన వధువు.