Aryan Khan: ఆర్య‌న్ ఉన్న సెల్ ఎలా ఉందో వివ‌రించిన తోటి ఖైదీ..!

Aryan Khan: డ్రగ్స్ కేసులో ఈ నెల రెండో తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. అత‌ని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. జైలులో ఆర్యన్ ఖాన్ ఆహారం తీసుకోవడం లేదని.. తన వంతు ఆహారాన్ని తోటి ఖైదీలకు ఇచ్చేస్తున్నాడనీ తెలుస్తోంది.

Aryan khan Life in Jail is too Bad
Aryan khan Life in Jail is too Bad

ఆర్యన్ ఉన్న జైలులోనే అక్టోబర్16 వరకూ జైలు జీవితం గడిపిన ఖైదీ రీసెంట్‌గా విడుద‌ల‌య్యాడు. నాడార్ ఒక మోసం కేసులో ఆర్థర్ రోడ్ జైలులో ఆరు నెలలు ఉన్నారు. అతను సోమవారం జైలు నుండి విడుదలయ్యాడు. ఆర్యన్ ను ఉంచిన బ్యారక్‌లోనే శ్రావణ్ కూడా ఉన్నాడు. ఆర్యన్ బ్యారక్‌లో ఆహారాన్ని అందించడం శ్రావణ్ విధి.

ఆర్య‌న్ గురించి చెప్పుకొచ్చిన శ్రావ‌ణ్‌.. ఆర్యన్, అతని సహచరులను వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన తర్వాత నంబర్ 1 బ్యారక్‌కి తీసుకువచ్చారని చెప్పారు. బ్యారక్‌లో 4 సెల్స్ ఉంటాయి. ఒక్కో సెల్ లో 100 మంది ఖైదీలు ఉన్నారు. అంటే, సెల్స్ లో కలిపి 400 మంది ఖైదీలు ఉన్నారు. అందరూ ఒకరి పక్కన ఒకరు నిద్రపోతారు.

ఒక సెల్‌లో 4 టాయిలెట్‌లు ఉన్నాయి. ఇది ఒక వెస్ట్రన్.. 3 ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ తో ఉంది. మొదటి రోజునే ఆర్యన్ జైలులో టీ తాగాడని శ్రవణ్ చెప్పాడు. నేను దానిని అతనికి ఇచ్చాను. అది తప్ప అతను ఏమీ తినలేదు. అతను క్యాంటీన్ నుండి బిస్కెట్లు, చిప్స్ ఆర్డర్ చేస్తాడు. బిస్కెట్‌ను నీటిలో ముంచి అతను తినడం నేను చాలాసార్లు చూశాను. బాటిల్ వాటర్ తాగుతాడు.

శ్రావణ్ జైలు నిబంధనల ప్రకారం ‘హక్ కా భట్టా’ (అతని వాటా ఆహారం) తీసుకోవాల్సి ఉందని చెప్పాడు. ఆర్యన్ తన ఆహారాన్ని తీసుకుంటాడు. కానీ, అతను దానిని ఇతర ఖైదీలకు ఇస్తాడు. అతను ఏమీ తినడు. మనస్సు బాగోలేదు, ఆకలి లేదు అని మాత్రమే చెప్పాడు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా కూర్చున్నాడు. అంటూ శ్రవణ్ చెప్పుకొచ్చాడు.