Aryan Khan: తిండి తిని నాలుగు రోజులైంది.. షారూఖ్ త‌నయుడి ఆరోగ్యంపై అంద‌రిలో ఆందోళ‌న‌

Aryan Khan: ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.. కేసు తదుపరి విచారణ జరిగే వరకు జైల్లోనే ఉండనున్నారు. బెయిల్ కోసం ఎంత ప్ర‌య‌త్నించిన కూడా కుదర‌డం లేదు.

Aryan Khan Did not eat Food for 4 days
Aryan Khan Did not eat Food for 4 days

ఆర్యన్ ఖాన్ విషయంలో కావాలని కేంద్ర సర్కార్ ఇదంతా చేస్తుందని, కేంద్ర దర్యాప్తు సంస్థల వెనుక కేంద్రం హస్తం ఉందని కాగా, ఇప్పటికి మూడుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ రోజు (బుధవారం) మరోసారి విచారణ జరగనుంది. అయితే ఆర్యన్ ఖాన్ విషయంలో కావాలని కేంద్ర సర్కార్ ఇదంతా చేస్తుందని, కేంద్ర దర్యాప్తు సంస్థల వెనుక కేంద్రం హస్తం ఉందని ఆరోపణలు వెల్లువగా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే కొడుకుకు బెయిల్ రాకపోవటంతో గౌరీఖాన్ ఏడుస్తున్నారని, షారూక్ ఖాన్ భోజనం చెయ్యటం లేదని, నిద్రపోవటం లేదని సమాచారం. బాలీవుడ్ వర్గాలు, షారూక్ ఖాన్ ఫ్యాన్స్ ఆర్యన్ ఖాన్ నేరస్తుడు కాదని, షారూక్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మ‌రోవైపు జైలుకు వెళ్లిన దగ్గర్నుంచి ఆర్యన్ భోజనం ముట్టుకోలేదట. జైలు క్యాంటిన్‌లో కొనుకున్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట.

ఇవ‌టి నుంచి తీసుకొచ్చిన వాటిర్ బాటిల్స్‌లోని నీటినే పొదుపుగా వాడుకుంటూ తాగుతున్నాడట. అంతేకాదు జైలులోని బాత్రూమ్‌కు ఆర్యన్ ఇప్పటివరకు వెళ్లలేదట. నాలుగు రోజులుగా స్నానం చేయలేదట. జైలు మాన్యువల్ ప్రకారం, ఖైదీ తనతో పాటు 2500 రూపాయలు తీసుకెళ్లవచ్చు. ఈ డబ్బు జైలు అధికారులు తీసుకుని ఖైదీకి ఓ కూపన్ ఇస్తారు. ఆ కూపన్‌ను ఉపయోగించి, జైలు క్యాంటిన్ నుంచి ఆహార పదార్థాలు, సబ్బు, నూనె, టూత్‌పేస్ట్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు.

భోజనం చేయకపోవడంతో ఆర్యన్ చాలా నీరసంగా అయిపోయాడట. దీంతో అతని ఆరోగ్యం గురించి జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారట.