Aryan Khan: అరెస్ట్ అయిన షారూఖ్ త‌న‌యుడు.. అధికారుల ముందు ఏడ్చేసిన ఆర్య‌న్‌

Aryan Khan: ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని ముందే గ్ర‌హించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దాడి చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌తోపాటు మొత్తం 8మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.

Aryan Khan Cried Before Police Officers
Aryan Khan Cried Before Police Officers

ఆర్యన్‌ నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఎన్‌సీబీకి తెలిపాడు. అతను యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు చెప్పాడు. అయితే అంతకుముందు షారుక్‌ ఖాన్‌ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు.

ఎన్సీబీ అధికారులు ప్రశ్నించే సమయంలో తన తండ్రితో 2 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడేందుకే అతడికి అవకాశమిచ్చారు. పోలీసుల దాడిలో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఏమ్‌డీ, 21 గ్రాముల చరస్‌తో పాటు రూ.1.33లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆర్యన్‌తో సహా మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక, విక్రాంత్ చోకర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

Aryan Khan Cried Before Police Officers
Aryan Khan Cried Before Police Officers

విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ కోసం ఆర్యన్ తరఫున వాదించటం కోసం క్రిమినల్ లాయర్ గా పేరుగాంచిన సతీష్ మానషిండే రంగంలోకి దిగినట్టు సమాచారం. రాంజెఠ్మలానీ వద్ద పనిచేసిన ఈయన బాలీవుడ్ కి చెందిన చాలా హై ప్రొఫైల్ కేసులను వాదించారు.