Aryan khan: ఇద్ద‌రికి బెయిల్ మంజూరు.. ఆర్య‌న్ బెయిల్ విచార‌ణ ఇంకా పెండింగ్‌లోనే..!

Aryan khan: డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్య‌న్ ఖాన్ జైలులోనే ఇబ్బందులు ప‌డుతూ వ‌స్తున్నాడు. ఇప్పటికీ కోర్టు మూడు సార్లు బెయిల్ ను తిరస్కరించగా.. ఈ రోజు నాలుగో సారి ముంబాయి కోర్టులో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ జరుగుతుంది. అయితే.. ఈ సారైనా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

TheNewsQube-
Aryan Khan Case Update on Bail
Aryan Khan Case Update on Bail

ఈ రోజు ఆర్యన్ బెయిల్ పిటీష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌గా, బెయిల్‌ పిటిషన్‌ను రేపటికి(బుధవారం) వాయిదా వేసింది ముంబై హైకోర్టు. బెయిల్ పిటిషన్ రేపు (బుధవారం, అక్టోబర్ 27) విచారణకు రానుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. ఆర్యన్, అర్బాజ్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి.

మరోసారి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అక్టోబర్ 20న జరిగిన విచారణలో ఎన్‌డిపిఎస్ చట్టం కింద బెయిల్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో ఆర్యన్ ఖాన్ వెంటనే హైకోర్టును విచారణకు తరలించారు. మేజిస్ట్రేట్ కోర్ట్,సెషన్స్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆర్యన్ ఖాన్ తరపు తరఫు వాదనలు వినిపించేందుకు భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈరోజు హాజరయ్యారు.

ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని , ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ రాకెట్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని కూడా అఫిడవిట్‌లో పేర్కొంది ఎన్సీబీ. అయితే ఎన్సీబీకి కౌంటర్‌గా హైకోర్టులో ఆర్యన్‌ కూడా అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఎన్సీబీలో జరుగుతున్న గొడవతో తనకు సంబంధం లేదని తెలిపాడు ఆర్యన్‌.

సాక్షులతో తనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవని తెలిపాడు. వాట్సాప్‌చాట్స్‌ను పరిగణ లోకి తీసుకోవద్దని కూడా అఫిడవిట్‌లో కోరాడు ఆర్యన్‌. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది ఈ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు అనుమతించింది. అవిన్ సాహు, మనీష్‌లకు బెయిల్‌ దొరికింది.