Aryan Khan: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన షారూఖ్ త‌న‌యుడు

Aryan Khan: డ్ర‌గ్స్ కేసులోఈ మ‌ధ్య చాలా మంది సినీ ప్ర‌ముఖులు అరెస్ట్ అవుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం.తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! సముద్రం మధ్యలో క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‎ వాడుతూ దొరికిపోయిన షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరికొందరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది.

Aryan Khan Breaks Down In Tears After Shah Rukh Khan Comes To Meet Him In NCB Custody
Aryan Khan Breaks Down In Tears After Shah Rukh Khan Comes To Meet Him In NCB Custody

ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ముంబై కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అతడిని ఎన్‌సీబీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆర్యన్‌ నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఎన్‌సీబీకి తెలిపాడు. అతను యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు చెప్పాడు.

షారుక్‌ ఖాన్‌ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. ఇదిలా వుంటే తన కొడుకును కలవడానికి షారుఖ్‌ కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి కోరగా ఇందుకు ఎన్‌సీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాకప్‌లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్లాడు షారుఖ్‌.

తండ్రిని చూడగానే ఆర్యన్‌ బోరుమని ఏడ్చినట్లు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. కొడుకును అలాంటి దుస్థితిలో చూసి షారుఖ్‌ సైతం తల్లడిల్లిపోయినట్లు సమాచారం. అధికారులు రైడ్‌ చేసిన సమయంలో తన కొడుకు దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ దొరక్కపోయినప్పటికీ అతడిని ఇలా లాకప్‌లో పెట్టడాన్ని చూసి ఎంతగానో బాధపడ్డాడట షారుఖ్‌.

క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు చేసిన మెరుపుదాడిలో 13 గ్రాముల కొకైన్‌, 21 గ్రాముల చరాస్‌, 5 గ్రాముల మెఫెడ్రోన్‌తో పాటు కొన్ని పిల్స్‌ను అలాగే రూ.1,33,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌తో సహా మున్మున్‌ ధమేచా, అర్బాజ్‌ మర్చంట్‌, ఇస్మీత్‌ సింగ్‌, గోమిత్‌ చోప్రా, నూపుర్‌ సారిక, విక్రాంత్‌ చోకర్‌, మొహక్‌ జైస్వాల్‌ తదితరులను