ఇండ‌స్ట్రీలో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు అరుణ్ అలెగ్జాండ‌ర్ మృతి.. ఆందోళ‌న‌లో అభిమానులు

Samsthi 2210 - December 29, 2020 / 10:24 AM IST

ఇండ‌స్ట్రీలో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు అరుణ్ అలెగ్జాండ‌ర్ మృతి.. ఆందోళ‌న‌లో అభిమానులు

ఈ ఏడాది సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఏ మాత్రం క‌లిసి రాలేదు. కరోనాతో చాలా మంది సినీ కార్మికులు రోడ్డున ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తే, మ‌రోవైపు వ‌రుస‌గా ప‌లువురు లెజండ‌రీ న‌టీన‌టులు, కొరియోగ్రాఫ‌ర్స్, ర‌చ‌యిత‌లు క‌న్నుమూయ‌డం విషాదాన్ని మిగిల్చింది. తాజాగా మ‌రో ప్ర‌ముఖ న‌టుడు గుండెపోటుతో క‌న్నుమూశారు. ఖైదీ చిత్రంలో పోలీస్ అధికారిగా న‌టించిన అరుణ్ అలెగ్జాండ‌ర్ సోమ‌వారం రోజు మృత్యువాత ప‌డ్డారు. 48 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న అరుణ్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా సుప‌రిచితం.

dub

‘మనరం’, ‘కోలమావు కోకిలా’, ‘ఖైదీ’, ‘బిగిల్’ సినిమాల్లో అద్భుతైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన అరుణ్ చిన్న వ‌య‌స్సులో మృత్యువాత ప‌డ‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు తెప్పిస్తుంది. చివ‌రిగా మాస్ట‌ర్ చిత్రంలో అరుణ్ న‌టించ‌గా, ఆ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అరుణ్ మృతి ఇండ‌స్ట్రీని కూడా దిగ్భ్రాంతికి గురి చేయ‌గా, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు. కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

చిత్ర సీమలో 2020 సంవత్సరం తీవ్ర విషాదాన్ని నింప‌గా, టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌లోనూ చాలా మంది ప్రముఖ నటుల్ని కోల్పోయాం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదలుకొని ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, నిషికాంత్ కామత్, సరోజ్ ఖాన్, జగదీప్, రాక్‌లైన్ సుధాకర్, వడివేల్ బాలాజీ, జయప్రకాష్ రెడ్డి, చిరంజీవి సర్జా, సేతురామన్ ఇలా చాలా మంది ఈ ఏడాది మృత్యువాత ప‌డ్డారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us