SONU SOOD: క‌ళాకారుడి టాలెంట్‌కు సోనూసూద్ ఫిదా.. వైర‌ల్‌గా మారిన వీడియో

దైవం మానుష్య రూపేనా అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న సోనూసూద్ ఆప‌ద స‌మ‌యంలో అంద‌రికి సాయం చేస్తూ దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుండి కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ఎంద‌రో ప్రాణాలు కాపాడాడు. ఇటీవ‌ల కూడా ఒక కరోనా రోగి కోసం ప్రత్యేకంగా ఎయిర్ ఆంబులెన్స్ అరేంజ్ చేశాడు . ఇక బెంగళూరులోని ఓ ఆస్పత్రికి సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఏకంగా 22 మంది ప్రాణాలు కాపాడాడు. రీసెంట్‌గా 30 మంది కొవిడ్ -19 రోగుల ప్రాణాలు నిలిచేలా చేశాడు. సోనూసూద్ సాయాల‌కు అవ‌ధులు లేకుండా పోయాయి.

సోనూసూద్ సాయాలు చూసి కొంద‌రు తెగ ఇంప్రెస్ అవుతున్నారు. య‌శ్వంత్ అనే క‌ళాకారుడు నోటితో బ్ర‌ష్ పెట్టుకొని సోనూసూద్ ఫొటో అద్భుతంగా గీసాడు. మీ సేవా త‌త్ప‌ర‌త న‌న్ను ఎంత‌గానో ఇంప్రెస్ చేసింది. మీరు చాలా మందికి స్పూర్తిగా నిలిచారంటూ య‌శ్వంత్ త‌ను బొమ్మ గీసిన వీడియోని షేర్ చేశాడు.క‌ళాకారుడి టాలెంట్‌కు ఇంప్రెస్ అయిన సోనూ సూద్ ఏదో ఒక రోజు మిమ్మ‌ల్ని త‌ప్ప‌క క‌లుస్తానంటూ ట్వీట్ చేశాడు. సోనూ ప్రాణాలు నిల‌ప‌డమే కాకుండా ఎంద‌రికో ధైర్యాన్ని అందిస్తున్నారు.