Arohi Rao : బిగ్ బాస్ తెలుగు: ఆరోహి వికెట్ డౌన్.! ఇదీ ట్విస్ట్ అంటే.!
NQ Staff - October 1, 2022 / 10:44 PM IST

Arohi Rao : బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్లోనూ లీకులు అస్సలేమాత్రం ఆగడంలేదు. ఎవరెవరు ఎలిమినేషన్ కోసం నామినేట్ అవబోతున్నారు.? ఎవరు కెప్టెన్ అవుతారు.? వంటి విషయాలపై ముందే బిగ్ బాస్ వీక్షకులకు ఖచ్చితమైన సమాచారం అందేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ లీకులు క్షణాల్లో అంతటా పాకేస్తున్నాయ్.
ఈ వారం ఎలిమినేషన్ ఎవర్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తుంది.? అన్నదానిపై నిన్న మొన్నటిదాకా చర్చోపచర్చలు జరిగాయి. అయితే, ఆరోహీ వికెట్ డౌన్.. అని బుధవారమే ‘లీకు’ బయటకు వచ్చింది. అదెలా సాధ్యం.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.
అర్జున్ కళ్యాణ్ వెళ్ళిపోతానన్నాడు కదా..!
‘నేనే ఈ వారం ఔట్ అయిపోతానేమో..’ అంటూ చాలా కాన్పిడెంట్‌గా ఆవేదన వ్యక్తం చేసేశాడు అర్జున్ కళ్యాణ్. కానీ, వికెట్ పడబోయేది అతని గర్ల్ ఫ్రెండ్ ఆరోహిదేనట. ఆరోహి ఆల్రెడీ హౌస్ నుంచి ఎవిక్ట్ అయిపోయిందనీ, ఈ ఎపిసోడ్ రేపు ప్రసారం అవుతుందనీ అంటున్నారు.
కాగా, అర్జున్ కళ్యాణ్ హౌస్‌లో ఇటు ఆరోహీతోనూ అటు వాసంతితోనూ పులిహోర గట్టిగానే కలిపేస్తోన్న విషయం విదితమే. సో, ట్రయాంగిల్ లవ్ స్టోరీకి బిగ్ బాస్ ఇలా చెక్ పెట్టాడన్నమాట. నిజానికి, ఆరోహి ఇంకొన్ని వారాలపాటు హౌస్‌లో వుండాల్సిన క్యాండిడేట్.
కాస్త విషయం వున్నోళ్ళని ఎంచుకుని మరీ బిగ్ బాస్ నిర్వాహకులు బయటకు పంపేస్తున్న సంగతి తెలిసిందే.