Pushpa: అల్లు అర్జున్‌పై ఆగ‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం.. బాలీవుడ్ ఫ్యాన్ బాయ్ ఏమ‌న్నాడంటే..!

Pushpa: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా తొలుత మిక్స్ డ్ టాక్ పొందిన ఆ త‌ర్వాత పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగింది. ఈ సినిపై సామాన్యులే కాక సెల‌బ్స్ కూడా స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా జనవరి 7 నుంచి తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Arjun Kapoor Praises Pushpa movie
Arjun Kapoor Praises Pushpa movie

ఇప్పటికే పలు సినీ సెలెబ్రిటీస్ ఈ సినిమా పట్ల తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాపై మంచు లక్ష్మి స్పందించారు. పుష్ప చిత్రం వీక్షించిన తర్వాత అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పుష్ప సినిమా కాదు.. అదొక అద్భుతమైన అనుభూతి. యాటిట్యూడ్, ఇంటెన్సిటీ, కూల్ నెస్ కలగలిపిన చిత్రం ఇది. ఆర్య నుంచి అల్లు అర్జున్ సినిమాలన్నీ చూస్తున్నాను.

ఒక అభిమానిగా ఆర్య నుంచి పుష్ప వరకు బన్నీ జర్నీ చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్. అల్లు అర్జున్ కళ్ళల్లోని ఆ ఫైర్ బిగ్ స్క్రీన్ ని తగలబెట్టే విధంగా ఉంది అంటూ అర్జున్ కపూర్ బన్నీని ప్రశంసలతో ముంచెత్తాడు. అర్జున్ కపూర్ మాటలకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెబుతూ బదులిచ్చాడు.

ఇక పుష్ప సినిమా అదిరిపోయిందని, అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉందంటూ హ్యాట్సాఫ్ చెప్పుకొచ్చారు లక్ష్మి. పుష్పరాజ్ లాంటి పాత్రను చేయడానికి చాలా కష్టం, స్టార్ హీరో ఇలాంటీ పాత్ర చేసి మెప్పించడం బాగుందన్నారు మంచు లక్ష్మి. అంతేకాదు ఈ సినిమాలో సమంత డాన్స్‌తో, రష్మిక తన నటనతో కేక పెట్టించారని.. దేవిశ్రీప్రసాద్ కూడా అదిరే మ్యూజిక్‌తో మైండ్ బ్లాంక్ చేశారంటూ పుష్ప టీమ్‌ను మెచ్చుకున్నారు.

Arjun Kapoor Praises Pushpa movie
Arjun Kapoor Praises Pushpa movie

పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు మంచు లక్ష్మి. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ థాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.