Malaika Arora : బ్రేక‌ప్ అంటూ పుకార్లు.. నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదంటూ హీరో కామెంట్

Malaika Arora : ఈ మ‌ధ్య సెల‌బ్స్ బ్రేక‌ప్ విష‌యం తెగ పాపుల‌ర్ అవుతుంది. నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల త‌ర్వాత ష‌ణ్ముఖ్‌- దీప్తి సున‌యన బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఇక నిన్న‌టి నుండి బాలీవుడ్ స్టార్ క‌పుల్ అర్జున్ క‌పూర్, మ‌లైకా అరోరా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

Malaika Arora
Arjun Kapoor about breakup with Malaika Arora

గత కొన్ని ఆరు రోజులుగా మలైకా అరోరా తన ఇంటి నుంచి బయటకు రాలేదని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. మలైకా ఒంటరిగా మరియు చాలా విచారంగా ఉన్నారట. అర్జున్ కపూర్ , రియా కపూర్‌ కలిసి మూడు రోజుల క్రితం డిన్నర్ పార్టీకి వెళ్లగా.. అక్కడ కూడా మలైకా లేరట. రియా ఇల్లు మలైకా ఇంటికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. డిన్నర్ తర్వాత అర్జున్ ఆమెను కలవలేదట.

మలైకా సాధారణంగా అర్జున్ ఫ్యామిలీ డిన్నర్‌లకు అర్జున్‌తో కలిసి హాజరవుతుంటారు. కానీ తాజాగా అర్జున్ ఫ్యామిలీతో మలైకా కలవడం లేదని వార్తల సారాంశం. దాంతో స్టార్ కపుల్ అర్జున్‌ – మలైకా బ్రేకప్ అనే వార్త నెట్టింట హల్చల్ చేసింది. ఈ క్రమంలో తమపై వచ్చిన తాజా రూమార్లకు చెక్‌ పెడుతూ అర్జున్‌ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు.

మలైకాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన అర్జున్ కపూర్.. చెత్త పుకార్లకు చోటు లేదంటూ తేల్చి చెప్పాడు. ‘నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్’ అనే క్యాప్షన్‌తో రూమర్లకు స్పష్టత ఇచ్చాడు అర్జున్‌ కపూర్‌.

అర్జున్ పోస్ట్‌పై మలైకా కూడా స్పందించారు. హార్ట్ ఎమోజీ పోస్ట్ చేసి తమ మధ్య బంధం బాగుందని పేర్కొన్నారు. తారా సుతారియా, భూమి పెడ్నేకర్, అమృత అరోరా, సోఫీ చౌదరి, అతియా శెట్టి, తాహిరా కశ్యప్ మరియు అమీ జాక్సన్ కూడా అర్జున్ పోస్ట్‌పై స్పందించారు.