Ariyana: ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన అరియానా..!

Ariyana: బిగ్ బాస్ షో త‌ర్వాత అరియానా పేరు మారుమ్రోగిపోతుంది.ఈ అమ్మ‌డు ఇటు సోష‌ల్ మీడియాలో అటు బ‌య‌ట తెగ సంద‌డి చేస్తుంది. అయితే అస‌లు బిగ్ బాస్ షోకి అరియానా వెళ్ల‌డానికి కార‌ణం రామ్ గోపాల్ వ‌ర్మ అని చెప్పాలి. ‘నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ కామెంట్ చేయడం హాట్ ఇష్యూగా మరి అరియానాకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ గడపతొక్కిన ఈ బోల్డ్ పాప.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలబడి టాప్-5లో నిలిచింది.

ariyana

బిగ్ బాస్ నుండి బ‌య‌టకు వ‌చ్చాక వ‌ర్మ‌ని ప‌లుమార్లు క‌లిసింది అరియానా. రీసెంట్‌గా ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించానని, దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది అరియానా.

ముక్కుసూటిగా మాట్లాడే అరియానా అంటే అంద‌రికి మక్కువ ఎక్కువ‌. తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ అమ్మడి యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్‌ మీడియాలో ఈమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అరియానా తాజాగా తాను ప్రేమలో ఉ‍న్నట్లు ప్రకటించింది. గతంలో కంటే ఇంకా ఎక్కువగా తనను తాను ఇష్టపడుతున్నానని.. మీరు కూడా ఇంతేనా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్‌ చేసింది.

ariyana

మ‌రి అరియానా త‌న‌ను తాను ఇష్ట‌ప‌డ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది, స‌డెన్‌గా ఆమెపై ఆమెకు అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింద‌ని నెటిజ‌న్స్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.