Ariyana: అరియానాకు పెళ్లి క‌ళ వ‌చ్చిందంట‌.. అబ్బాయి మాత్రం అవినాష్ కాదంటున్నారు!

Ariyana: అరియానా.. ఈ పేరు బిగ్ బాస్ షోకు ముందు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు. రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో కొంత ఫేమ‌స్ అయిన అరియానా ఆ త‌ర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. టాప్ 5లో ఒక‌రిగా నిలిచిన అరియానా త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. ముక్కుసూటిత‌నం, త‌ప్పును త‌ప్పు అని చెప్పే ధైర్యం అభిమానుల‌కి ఎంత‌గానో న‌చ్చింది. బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమ‌స్ అయిన అరియానా ఈ మ‌ధ్య త‌న పెళ్లి వార్త‌ల‌తోను ఎక్కువ‌గా నిలుస్తుంది. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు అరియానా ఒక్క‌డితో చాలా చ‌నువుగా ఉన్న అరియానా బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా కొన‌సాగించింది. అవినాష్‌తో క‌లిసి ప‌లు షోస్ చేయడం, ఖాళీ స‌మ‌యాల‌లో అవినాష్‌తో క‌లిసి విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం చేసింది.

అరియానా- అవినాష్ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని, వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటే చూడాల‌ని ఉంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ కూడా త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే అరియానా ఈ మ‌ధ్య పెళ్లి కూతురు గెట‌ప్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అంటూ నెటిజ‌న్స్ జోస్యాలు చెప్పారు. ఇప్పుడు మ‌రోసారి అరియానా పెళ్లి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. అరియానా కోసం కుటుంబ స‌భ్యులు సంబంధాలు చూస్తున్నార‌ని, వీలైనంత త్వ‌ర‌లోనే అరియానా పెళ్లి చేయ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఇక అవినాష్ కూడా త‌న కుటుంబ స‌భ్యులు చూసిన అమ్మాయినే వివాహం చేసుకుండ‌టాడ‌ని టాక్.

 

అవినాష్‌, అరియానాల పెళ్లిపై ఏదో ఒక క్లారిటీ రాక‌పోతే నిత్యం ఇలాంటి వార్త‌లు ఎన్నో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం ఖాయం.ప్ర‌స్తుతం అరియానా స్టార్ మాలో అవినాష్‌తో కలిసి అరాచకం చేస్తున్నారు . బిగ్ బాస్‌లో ఫైనలిస్టుగా నిలిచిన అరియానా బిగ్ బాస్ నుంచి దాదాపు 30 లక్షల వరకు దక్కించుకున్నారు. అంతేకాదు అక్కడ అవినాష్ లాంటి మంచి స్నేహితుడిని కూడా సంపాదించుకున్నారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సమాధానం చెప్తున్నప్పటికీ, ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే మాత్రం అభిమానుల‌లో అనేక అనుమానాలు క‌లుగుతున్నాయి. చూడాలి వీరి పెళ్లికి సంబంధించి ఎప్పుడు పూర్తి క్లారిటీ వ‌స్తుందో మ‌రి..!