Ariyana: వెంటిలేట‌ర్‌పై అరియానా.. ఫొటోలు చూసి భ‌య‌ప‌డుతున్న ఫ్యాన్స్

Ariyana వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన బుల్లితెర యాంక‌ర్ అరియానా గ్లోరీ.బిగ్ బాస్ షో త‌ర్వాత భారీ ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ అమ్మ‌డు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య వ‌ర్మతో బోల్డ్ ఇంట‌ర్వ్యూ చేసిన అరియానా నేష‌న‌ల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఇక సోష‌ల్ మీడియాలో త‌న పర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన విష‌యాలు షేర్ చేస్తూ వ‌స్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా స్ట‌న్నింగ్ వీడియో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తాను వెంటిలేటర్‌పై ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చింది. ఇది ఓ సినిమా కోసం పెట్టుకుంద‌ని తెలిసి అభిమానులు శాంతించారు. ప్ర‌స్తుతం వెండితెరపై కూడా సంద‌డి చేసేందుకు అరియానా సిద్ధ‌మ‌వుతుండ‌గా, ఈ అమ్మ‌డు శ్రీధ‌ర సీపాన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తోన్న ఓ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తోంది అరియానా.

ఇందులోని ఓ సీన్ కోసం అరియానా ఆక్సీజన్ మాస్కుతో వెంటిలేటర్ మీద ఉన్నట్లు నటిస్తోంది. ఆ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోనే ఆరియానా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.

మ‌రోవైపు అరియానా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన అభిమానుల‌కు మైండ్ బ్లాక్ అయింది. బ్లాక్ స్క‌ర్ట్ లో కిల్లింగ్ లుక్స్‌తో చంపేసింది అరియానా. ప్ర‌స్తుతం ఈ పిక్స్ కూడా సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

తన ఆట తీరు.. మాటలతో ప్రేక్షకులని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న అరియా బిగ్ బాస్.. ఫైనల్ వరకు వెళ్లింది. బిగ్‏బాస్ తర్వాత అరియానాకు వెండితెర అవకాశాలు వరుసగా తలుపు తట్టాయి. యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ అందుకుంది అరియానా. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది.