AVINASH: అవినాష్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ ప్ర‌చారం.. అమ్మాయి ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్‌?

Samsthi 2210 - April 22, 2021 / 05:34 PM IST

AVINASH: అవినాష్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ ప్ర‌చారం.. అమ్మాయి ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్‌?

AVINASH జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో ఫేమ‌స్ అయిన అవినాష్‌.. బిగ్ బాస్ రియాలిటీ షోతో మ‌రింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. సీజ‌న్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అత‌ను దాదాపు 90 రోజులు హౌజ్‌లోనే ఉన్నాడు. హెల్దీ కామెడీతో హౌజ్‌మేట్స్‌ని, ఇటు ఆడియ‌న్స్‌ను తెగ న‌వ్వించేశాడు. ఫినాలేకు వ‌చ్చిన‌ప్పుడు చిరంజీవి అత‌నిని రాజ‌బాబుతో పోల్చారు. ఈ మాట‌తో అవినాష్ ఆనందం హ‌ద్దులు దాటింద‌నే చెప్ప‌వచ్చు. హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు తెగ సంద‌డి చేసిన అవినాష్ వీలున్న‌ప్పుడల్లా అమ్మాయిల‌తో పులిహోర బాగా క‌లిపాడు. ముఖ్యంగా అరియానాతో అయితే మాములుగా క‌ల‌ప‌లేదు. వీరిద్ద‌రిని చూసి స‌మ్‌థింగ్ స‌మ్‌థింగా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెట్టారు.

బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా అరియానా– అవినాష్ మ‌ధ్య బాండింగ్ అలాగే కొన‌సాగుతుంది. ఇద్ద‌రు క‌లిసి షోస్ చేయ‌డం, ఖాళీ స‌మ‌యాల‌లో విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్ప‌టి నుండి అవినాష్ పెళ్లి పాట పాడుతూనే ఉండేవాడు. నాగార్జున కొన్ని సంద‌ర్బాల‌లో నీకు పెళ్లి కాదు అంటూ తెగ ఏడిపించారు కూడా. అయితే ఓ సారి త‌మ పిల్ల‌ల‌ను క‌లిసేందుకు త‌ల్లిదండ్రులు హౌజ్‌లోకి రాగా, అప్పుడు అవినాష్ త‌ల్లి కూడా వ‌చ్చారు. ఆమె బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాన‌ని మాట ఇచ్చింది.

అవినాష్ చేతి నిండా సంపాదిస్తున్నాడు. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌ని క్రేజ్ మ‌రింత పెరిగింది. దీంతో ఆఫ‌ర్స్ కోకొల్ల‌లుగా వ‌స్తున్నాయి. ముఖ్యంగా అరియానాతో మ‌నోడు చేసే షోస్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అవినాష్ – అరియానాలు ఆన్‌స్క్రీన్‌లో మంచి జోడి అని నిరూపించుకోగా, ఇప్పుడు ఆఫ్‌స్రీన్‌లోను ఒక్క‌టి కాబోతున్నారనే వార్త దావానంలా వ్యాపించింది. సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రి పెళ్లిపై అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి దీనిపై ఇద్ద‌రిలో ఎవ‌రైన స్పందిస్తారా అనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us