Ariyana: ఇంటర్వ్యూ తరువాత జిమ్ లో వర్కవుట్స్ మొదలెట్టిన అరియానా,ఆర్జీవీ

Ariyana: అరియానా ఈ పేరు ఒకప్పుడు ఎవ‌రికి తెలిసేది కాదు. రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ఇంట‌ర్వ్యూ చేశాక అరియానా పేరు యూట్యూబ‌ర్స్‌కి బాగా తెలిసింది. ఇక కొద్ది రోజుల త‌ర్వాత బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్రమంలోకి అరియానా అడుగు పెట్ట‌గా ఈ అమ్మ‌డు త‌న యాటిట్యూడ్, ప్ర‌వ‌ర్త‌న‌, ముక్కుసూటిత‌నంతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. బిగ్ బాస్ షో త‌ర్వాత ఈ అమ్మ‌డి లైఫ్ పూర్తిగా మారింది. బుల్లితెర షోసే కాక సినిమా ఆఫ‌ర్స్ కూడా అందుకుంటుంది. ఇప్ప‌టికే రాజ్ త‌రుణ్ సినిమా ఆఫ‌ర్స్ కొట్టేసిన అరియానా ప్ర‌స్తుతం ప‌లు సినిమా క‌థ‌ల‌ను వింటున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఆర్జీవీ పుణ్యమా అంటూ అరియానా నేడు ఈ స్టేటస్‌ను అనుభవిస్తుండ‌గా, ఆమెను స‌పోర్ట్ చేయండంటూ కూడా ప్రేక్ష‌కుల‌ని కోరాడు.

Ariyana

అరియానా కెరియ‌ర్‌కు వ‌ర్మ ఎంతో స‌పోర్ట్ అందిస్తుండ‌గా, ఆ సాయాన్ని మ‌ర‌చిపోని అరియానా వీలున్న‌ప్పుడ‌ల్లా వ‌ర్మ‌ని క‌లుస్తూ ఉంటుంది. ఆ మ‌ధ్య ఓ సారి గోవాకు వెళ్లిన అరియానా .. వ‌ర్మ‌ని క‌లిసి అత‌నితో ఫొటోలు దిగింది. ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నేను ఎంత‌గానో ఇష్ట‌ప‌డే వ్య‌క్తిని క‌ల‌వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని పేర్కొంది. ఇక తాజాగా అరియానా, ఆర్జీవీలు కలుసుకున్నారు. అయితే ఈ సారి వర్మను ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా వెళ్లారట. ఇంటర్వ్యూ అనంతరం వర్మ తన స్టైల్లో అరియానాను వాడేసుకున్నారు.

Ariyana

ఈ మ‌ధ్య కండ‌లు పెంచే ప‌నిలో బిజీగా ఉన్నారు వ‌ర్మ‌. త‌ను క‌స‌ర‌త్తులు చేస్తున్న స‌మ‌యంలో వ‌ర్మని ఇంట‌ర్వ్యూ చేసేందుకు వెళ్లింది అరియానా. ఈ అమ్మ‌డు స్పోర్ట్స్ బ్రాలో దర్శనమివ్వగా ఆమె వెనకాల నుంచుని ఉన్న రామ్ గోపాల్ వర్మ డంబుల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫొటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రాము ఈ బిగ్ బాస్ లిటిల్ బ్యూటీ అరియానా గ్లోరీ నన్ను జిమ్ లో ఉండగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇద్ద‌రం క‌లిసి వ‌ర్క‌వుట్స్ చేశాం. ఇంట‌ర్వ్యూ త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానుంద‌ని ఫుల్ మైలేజ్ పెంచే ప్ర‌య‌త్నం చేశాడు. ఏదేమైన త‌న‌కు సంబంధించిన విష‌యాల‌పై వ‌ర్మ చూపించే ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ అదుర్స్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.