Ariyana: లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్.. అరియానా వీడియో వైరల్

Ariyana about Roll Rida
Ariyana about Roll Rida

Ariyana బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో అరియానా ఎంతలా ట్రెండ్ అయిందో… షో ముగిసిన తరువాత కూడా అంతే స్థాయిలో ట్రెండ్ అవుతూ వస్తోంది. అది తప్పైనా రైటనా కూడా పర్లేదు ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలి.. నాఇష్టం వచ్చినట్టు చేస్తాను అని షో ఎంట్రీలోనే క్లారిటీ ఇచ్చింది అరియానా. ఆమె అతిని చూసిన అందరూ అతియానా అని పేరు పెట్టేశారు. అయితే అతి కాస్త ఎక్కువగానే ఉన్నా కూడా కొన్ని కొన్ని సార్లు కరెక్ట్ పాయింట్లు మాట్లాడుతూ ఉంటుంది.

అందుకే అరియానా చివరి వరకు వచ్చింది. అయితే అరియానా బయటకు వచ్చాక తన క్రేజ్, ఫాలోయింగ్‌ను చూసుకుని ఫిదా అయినట్టుంది. కానీ ఇప్పుడు మాత్రం అరియానా అతిగా ఎక్కడా కూడా ప్రవర్తించడం లేదు. బిగ్ బాస్ షోలో కేవలం కెమెరాల ముందే అతిగా ప్రవర్తించినట్టుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కూడా మామూలుగానే కనిపిస్తోంది. తన బిగ్ బాస్ హౌస్ మేట్స్‌తో కలిసి పార్టీలు చేసుకున్నా, ఈవెంట్లలో పాల్గొన్నా కూడా అరియానా సాధారణంగానే ఉంటుంది.

వరుస ఆఫర్లతో అరియానా ఫుల్ బిజీగా మారిపోయింది. అందరి కంటే ముందుగా హీరోయిన్‌ చాన్స్ కొట్టేసింది. ఏకంగా సినిమా షూటింగ్ మొదలెట్టేసింది. స్టిల్స్ కూడా షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా రాబోతోన్న ఈ సినిమాలో అరియానా మంచి చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం అరియానా ఆ మూవీ షూటింగ్‌లో భాగంగానే భీమవరంలో ఉంది. అయితే వీకెండ్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకున్నట్టుంది.

అరియానా వీడియో.. Ariyana
అయితే తాజాగా రోల్ రైడా బర్త్ డేను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. రోల్ రైడ్ బర్త్ డే.. అరియానా పుట్టిన రోజులు ఈ మధ్యే జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే రోల్ రైడా బర్త్ డేను అందరూ కలిసి కాస్త ఆలస్యంగా సెలెబ్రేట్ చేశారు. ఇదే విషయాన్ని అరియానా చెప్పుకొచ్చింది. లేటు‌గా సెలెబ్రేట్ చేసినా.. గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నామని తెలిపింది. నా లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్ అంటూ రోల్ రైడా గురించి అరియానా చెప్పుకొచ్చింది. ఎప్పటికీ నా ఫ్రండ్ అంటూ ఎమోషనల్ అయింది.

Advertisement