Nani : నానికి కోపం తెప్పించారా..నెక్స్ట్ ఏంటీ..?

Nani : నానికి సహజంగా కోపం రాదంటుంటారు. ఎక్కడ కనిపించినా నాని మోహం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్ అయినా చాలా కూల్ గా కనిపిస్తుంటాడు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సస్ కాలేదని ఎవరైనా అడిగినప్పుడు కూడా నాని చెప్పే సమాధానం చాలా క్యాజువల్‌గా ఉంటుంది తప్ప.. రాష్‌గా ఎప్పుడు చెప్పింది లేదు. అలాంటి నానికి మొదటి సారి కోపం తెప్పించారట. ఈ మధ్య నాని విన్న ఒక మాటకి పట్టరాని కోపం వచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం టక్ జగదీష్ సినిమా.

are you making nani angry...what next...?
are you making nani angry…what next…?

నానికి ‘నిన్ను కోరి’ సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ. తనకి డెబ్యూ సినిమా కావడంతో మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగ చైతన్య – సమంతలతో తెరకెక్కించిన మజిలీ కూడా ఇలా ఫ్యామిలీ కథాంశంతోనే తెరకెక్కించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ‘టక్ జగదీష్’. ఈ సినిమాని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు శివ నిర్వాణ. ఈ సినిమా లో నానికి అన్నయ్యగా జగపతిబాబు నటిస్తుండగా.. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్ గా నటించారు.

Nani : నాని ఇలా రూమర్స్ క్రియేట్ చేయడమేంటని మండిపడుతున్నాడట.

అయితే ఈ మధ్య కాలంలో నానికి సరైన హిట్ దక్కకపోవడంతో ‘టక్ జగదీష్’ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేయగా .. ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న రూమర్స్ క్రియేటయ్యాయి. దాంతో నానికి కోపం వచ్చిందట. మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకుండా ఇలా రూమర్స్ క్రియేట్ చేయడమేంటని నాని మండిపడుతున్నాడట. అంతేకాదు వి సినిమా అనుభవంతో టక్ జగదీష్ థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడయ్యారట. అంటే ఎట్టి పరిస్థితుల్లో టక్ జగదీష్ ఓటీటీలో రాదని క్లారిటీ వచ్చేసింది.

Advertisement