Ardha shatabdham: ‘ఆహా’ నుంచి కాల్.. ‘అర్దశతాబ్దం’పై మేకర్స్ కామెంట్స్!

Ardha shatabdham ప్రస్తుతం తెలుగులో ఓటీటీ సంస్థ ఆహా దుమ్ములేపుతోంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నింటిని ఆహా దక్కించుకుంటుంది. కొన్ని నేరుగా ఆహాలోనే అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త షోలు కూడా రాబోతోన్నాయి. తాజాగా అర్ధశతాబ్దం అనే సినిమా కూడా ఆహాలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.

రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్ల పై వీర్ ధర్మిక్ సమర్పణలో కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజుచ దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమని నటీనటులుగా రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’.ఈ చిత్రం మార్చి 26 నుంచి ‘ఆహా’ లో రాబోతోంది.

‘ఆహా’ నుంచి కాల్.. ‘అర్దశతాబ్దం’ పై మేకర్స్

దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. డైరెక్టర్ క్రిష్ మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మా సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.కార్తీక్ కు రానా గారు బర్త్ డే విషెస్ తెలపడం. సుకుమార్ టీజర్‌ను లాంచ్ చేయడం, రకుల్ ప్రీత్ ఒక సాంగ్ లాంచ్ చేయడం, ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్ గా నిలిచారు వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. హా వారికి మా మా టీజర్ నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా అర్ధశతాబ్దం సినిమాను మార్చి 26 నుంచి వరల్డ్ ప్రీమియర్ గా 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేస్తున్నామని అన్నారు.

నిర్మాతలు చిట్టి కిరణ్, రాధాకృష్ణ మాట్లాడుతూ.. మా “అర్ధ శతాబ్దం” చిత్రాన్ని ఆదరించి మాకు సపోర్ట్ నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు. 22 సంవత్సరాల నుండి ఆర్టిస్ట్ గా మీ అందరికీ పరిచయ స్తున్నే.అయితే రవి, కిరణ్ లు షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగిందని అన్నారు.

Advertisement