AR Rahman : అర్హత లేని సినిమాలకు ఆస్కార్ ఇస్తున్నారు.. రెహమాన్ సంచలన కామెంట్లు..!
NQ Staff - March 16, 2023 / 12:30 PM IST

AR Rahman : ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఆస్కార్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సారి మన ఇండియన్ సినిమాకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిసారి మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది.
దాంతో చాలామంది ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని సార్లు సినిమాలు ఆస్కార్ వరకు వెళ్తాయని మనం అనుకుంటాం.
ఆ మూవీని ఉద్దేశించే..
కానీ అవి అంత దూరం వెళ్లవు. అర్హత లేని సినిమాలను పంపుతున్నారు. ఈ విషయంలో నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ సంచలన కామెంట్లు చేశారు ఏఆర్ రెహమాన్. దాంతో ఆయన చేసిన కామెంట్లు ఛెల్లో షో సినిమాను ఉద్దేశించే కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

AR Rahman Commented They Sending Films That Are Not Eligible For Oscar
ఈ సారి ఇండియా నుంచి త్రిబుల్ ఆర్ ను కాకుండా గుజరాత్ కు చెందిన ఛెల్లో షో మూవీని ఆస్కార్ కు పంపారు. అది కనీసం నామినేషన్స్ లో కూడా చోటు దక్కించు కోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అలాంటి సినిమాలను కాకుండా త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలను పంపాలని ఇన్ డైరెక్టుగా చెప్పారని అంటున్నారు నెటిజన్లు.