YS Jagan : ఊరూ వాడా అంగరంగ వైభవంగ ఏపీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు.!
NQ Staff - December 21, 2022 / 04:26 PM IST

YS Jagan : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఊరూ వాడా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులు స్వచ్ఛందంగా ఈ పుట్టినరోజుల్లో పాల్గొనడమే కాదు, జగన్ పుట్టినరోజు వేడుకల్ని కొందరు లబ్దిదారులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు కూడా.
కొన్ని చోట్ల ఇంటి వద్దకే రేషన్ కోసం ఏర్పాటు చేసిన వాహనాలతో ర్యాలీల్లాంటివి కూడా జరుగుతున్నాయి. రక్తదానాలు, ఆసుపత్రుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు రోగులకు పండ్లు పంచడం.. వంటి కార్యక్రమాల్నీ నిర్వహిస్తున్నారు.
వైఎస్ జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతోంది..
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కాగా, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వైఎస్ జగన్ అభిమానులు, తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. విదేశాల్లోని వైఎస్ జగన్ అభిమానులు సైతం, జగన్ పుట్టినరోజు నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుడుతున్నారు.