YS Jagan : సూపర్ స్టార్‌ కృష్ణ కు నివాళ్లు అర్పించే సమయంలో ఎదురు పడ్డ సీఎం జగన్‌, బాలయ్య

NQ Staff - November 16, 2022 / 01:51 PM IST

YS Jagan : సూపర్ స్టార్‌ కృష్ణ కు నివాళ్లు అర్పించే సమయంలో ఎదురు పడ్డ సీఎం జగన్‌, బాలయ్య

YS Jagan : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో ఆయన కి నివాళులు అర్పించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. పద్మాలయ స్టూడియోలో ఉన్న కృష్ణ పార్థివ దేహానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

అదే సమయంలో నందమూరి బాలకృష్ణ అక్కడే ఉండడం ఇద్దరు ఎదురు పడడం జరిగింది. బాలకృష్ణ అప్పటికే మహేష్ బాబుతో మాట్లాడుతూ ఉన్నాడు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి రాకతో మహేష్ బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులు నిలబడి ఉండగా వారితో కొద్ది సమయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అప్పుడే బాలకృష్ణ కనిపించడంతో నమస్కారం పెట్టాడు.

ఇద్దరు ఒకరికి ఒకరు నమస్కారం పెట్టుకున్నారు, అక్కడున్న వారు బాలకృష్ణను ముందుకు రావాల్సిందిగా కోరగా పరవాలేదు అన్నట్లు బాలకృష్ణ మహేష్ బాబు వెనకే ఉండి పోయాడు.

దాంతో ఇద్దరు ఎదుర్పడ్డా కూడా నవ్వుతూ నమస్కారం పెట్టుకోవడం వారకే పరిమితమైంది. బాలకృష్ణ కు ఒకానొక సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉండడం వల్ల ప్రత్యర్థులుగా మారారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us