Raghu rama: ఎంపీ ర‌ఘురామ ఇంటికి ఏపీ సీఐడి.. నోటీసులు ఇచ్చిన‌ట్టు టాక్

Raghu rama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గ‌త కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా ఆయ‌న తనపై అనర్హత వేటు వేయిస్తామంటూ వైసీపీ నేతలు చేసిన ప్రకటనలపై ఆయన స్పందించారు. అంతేకాదు సీఎం జగన్ తో పాటు తన వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు.

ap cid notices to raghu rama
ap cid notices to raghu rama

అనర్హత అనే పదాన్ని సీఎం జగన్ పదిసార్లు సరిగ్గా పలికితే తాను అనర్హత పడినట్లే భావిస్తానంటూ ఛాలెంజ్ చేశారు. తాను రాజీనామా చేసి నర్సాపురంలో పోటీ చేసి గెలుస్తానని.. తాను గెలిస్తే సీఎం జగన్ రాజీనామా చేసి భారతి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డిలో ఒకరికి సీఎం పదవి ఇస్తే ప్రజలకు కాస్తైనా ఉపశమనం లభిస్తుందన్నారు.

వ‌రుసగా హాట్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. రఘురామ కృష్ణంరాజు పై ఏపీలో నమోదైన కేసుల విషయంలో నోటీసు ఇచ్చేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నోటీసు ఇవ్వడానికి అధికారులు వచ్చినా కూడా రఘురామకృష్ణంరాజు బయటికి రాకపోవడంతో ఇంటి బయట సిఐడి అధికారులు వేచి ఉన్నారు.

విచారణకు రావాలని రఘురామకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు (గురువారం) విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామ గురువారం నరసాపురం వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజులపాటు నరసాపురంలో పర్యటిస్తానన్నారు. ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు రావడం చర్చనీయాంశమైంది.

ap cid notices to raghu rama1
ap cid notices to raghu rama1

సంక్రాంతి సందర్భంగా ఈనెల 13వ తేదిన ఉదయం నర్సాపురం వెళ్తున్నట్లు రఘురామ ప్రకటించారు. ఏకాదశి ముహూర్తం చూసుకొని మరీ తన నియోజకవర్గానికి వెళ్తున్నానన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా భీమవరం వెళ్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటానని తెలిపారు. సంక్రాంతి టూర్ సందర్భంగా ఎవరితోనూ మాట్లాడనని.. తన ప్రతికదలికను వీడియో తీయిస్తానని చెప్పారు. ఈనెల 16వ తేదిన తిరిగి ఢిల్లీ వస్తానని తెలిపారు.