Anushka shetty : అనుష్క శెట్టి నిశ్శబ్ధం అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ ..?

Anushka shetty : అనుష్క శెట్టి కి టాలీవుడ్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలకి ఉన్నంత క్రేజ్ అనుష్క శెట్టి కూడా ఇటు తెలుగులో అటు తమిళంలో సంపాదించింది. అరుంధతి సినిమాతో అనుష్క కెరీర్ మరో రేంజ్ కి వెళ్ళింది. అయితే ఈ సినిమా తర్వాత ఎక్కువగా ప్రయోగాలు చేసి తన కెరీర్ ని తానే చిక్కుల్లో పడేసుకుంది. ముఖ్యంగా సైజ్ జీరో సినిమా కోసం అనుష్క చేసిన రిస్క్ ఇప్పుడు తనకి అవకాశాలు లేకుండా చేసిందని చెప్పాలి. ఆ సినిమా ప్రభావం అనుష్క కెరీర్ మీద గట్టిగానే పడింది.

anushka-shetty-nishabdham flop on small screen also
anushka-shetty-nishabdham flop on small screen also

అసలే అనుష్క హైట్ చాలా మంది హీరోలకి మైనస్ అన్న కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తోడు సైజ్ జీరో తర్వాత బాగా బొద్దుగా తయారైంది. దాంతో అనుష్క కోసం అనుకున్న కొన్ని కథలు వేరే వాళ్ళతో తీయాల్సి వచ్చింది. బాహుబలి.. భాగమతి సినిమాలతో హిట్స్ అందుకున్నా కూడా అనుష్క మంచి ఫాం లోకి రాలేకపోయింది. ఈ క్రమంలో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన నిశ్శబ్ధం లో నటించింది. చెప్పాలంటే ఈ సినిమా మీద అనుష్క ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారీ స్టార్ కాస్టింగ్ ఉంది. కోన వెంకట్ లాంటి స్టార్ రైటర్..టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధూకర్ దర్శకత్వం .. ఇవేవి నిశ్శబ్ధం సినిమాకి కలిసి రాలేదు.

Anushka shetty : అనుష్క సినిమాకి ఇంత దారుణంగా రేటింగ్ వస్తుందని ఎవరూ ఊహించరు.

అయితే మహేష్ బాబు నటించిన ఖలేజా లాంటి సినిమాలు థియేట్రికల్ గా ఫ్లాప్ అయినప్పటికి బుల్లితెర మీద మాత్రం భారీ సక్సస్ గా నిలిచాయి. ఈ సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్నాయి. కాని ఇక్కడ కూడా అనుష్క నటించిన నిశ్శబ్ధం భారీ ఫ్లాప్ గానే మిగిలింది. ఈ సినిమాని బుల్లితెర మీద చూడటానికి అనుష్క అభిమానులే కాదు ప్రేక్షకులు పెదవి విరిచారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 3.85 టీఆర్పీ రేటింగ్ రావడం అందరికీ షాకింగ్ గా ఉంది. అనుష్క సినిమాకి ఇంత దారుణంగా రేటింగ్ వస్తుందని ఎవరూ ఊహించరు. ఇక ఈ సినిమా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ మూడపడి ఉండటంతో ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసందే.

Advertisement