Anushka shetty : అనుష్క శెట్టితో జాతిరత్నం మెచ్యూర్డ్ లవ్ స్టోరి..?

Anushka shetty : అనుష్క శెట్టి జోరు ఈ మధ్య బాగా తగ్గిపోయింది. స్టార్ డం ఉన్నప్పుడు వరసగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి లైఫ్ ని రిస్క్ లో వేసుకుంది. ఆ తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తున్నప్పటికి ఆ సినిమాలు అనుష్క కి ఏమాత్రం కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది అనుష్క శెట్టి. ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాలో
నటించింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలను అనుష్క అందుకోలేకపోయింది. ఓటీటీలో రిలీజైన నిశ్శబ్దం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

anushka-shetty-jatiratnam-matured-love-story
anushka-shetty-jatiratnam-matured-love-story

ఈ సినిమా తర్వాత మళ్ళీ అనుష్క నుంచి సినిమా ఏదీ ప్రకటించకపోవడంతో అందరూ తన నెక్స్ట్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుంచి ప్రముఖ
నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి ఒక సినిమా చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అఫీషియల్ గా మాత్రం మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రాలేదు. ఈ క్రమంలో మరోసారి అనుష్క సినిమాకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి తో అనుష్క ఒక సినిమా చేయబోతోందట.

Anushka shetty : యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి – నవీన్ పొలిశెట్టి కలిసి నటించబోతున్నారు.

నవీన్ పొలిశెట్టి ఏజెంట్ ఆత్రేయతో తన సత్తా చాటి మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాడు. దాంతో వరసగా రెండు పెద్ద బ్యానర్స్ లో నవీన్ పొలిశెట్టి నటించబోతున్నట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమాలో అనుష్క శెట్టి – నవీన్ పొలిశెట్టి కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదొక మెచ్యూర్డ్ లవ్ స్టోరి అని తెలుస్తోంది. మిడిల్ ఏజ్ ఉన్న యువతికి ఓ యువడికి మధ్య సాగే ప్రేమ కథలో అనుష్క – నవీన్ పొలిశెట్టి నటించనున్నారని.. వల్గారిటీ ఏమాత్రం ఉండకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ రానుందని సమాచారం.

Advertisement