Prabhas : ప్రభాస్ కు లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
NQ Staff - June 2, 2023 / 07:53 PM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ అనే పదానికి గుర్తింపు తీసుకువచ్చిందే ప్రభాస్. ఈయనతోనే పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయి. అందుకే ప్రభాస్ ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. తెలుగు హీరోలకు ఓ మార్గాన్ని చూపించింది కూడా మన డార్లింగే. ఒకప్పుడు ఆయన మార్కెట్ కేవలం తెలుగు వారికి మాత్రమే తెలుసు.
కానీ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే. అయితే ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. మనోడికి ఉన్నంత సిగ్గు ఎవరికీ ఉండదనే చెప్పుకోవాలి. అంత పెద్ద స్టార్ అయినా సరే చాలా వినయంగా ఉంటాడు.
పైగా హీరోయిన్లతో ఎక్కువగా లిప్ లాక్ సీన్లు కూడా పెట్టుకోడు ప్రభాస్. కానీ ఓ సినిమాలో మాత్రం స్టార్ హీరోయిన్ కు లిప్ లాక్ ఇచ్చాడు. అదే ఆయన సినీ కెరీర్ లో తొలి లిప్ లాక్ అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారు ఇంకెవరు అనుష్క శెట్టి. వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో నటించారు.

Anushka Shetty Gives Lip Lock Prabhas In Baahubali 2 Movie
అయితే ఈ సినిమాలోని ఓరోరి రాజా వీరాధి వీర అనే సాంగ్ చివరలో ఇద్దరికీ లిప్ లాప్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అది వీరిద్దరి నడుమ ఉన్న ప్రేమను మరింత బలంగా చూపించేదిగా ఉంటుందని రాజమౌళి అలా ప్లాన్ చేశాడు. ప్రభాస్ లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ గా అనుష్కశెట్టి మిగిలిపోయింది.