Anushka Shetty: మ‌రో సారి వార్త‌ల్లోకి అనుష్క పెళ్లి.. ఎప్పుడంటే..!

Anushka Shetty: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ అనుష్క పెళ్లి తంతుపై సినీ లోకం ఎప్పటినుంచో కన్నేసింది. గత కొన్ని నెలలుగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 1981 సంవత్సరంలో జన్మించిన అనుష్క.. గత 15 ఏళ్ల క్రిందట ‘సూపర్’ సినిమాతో పరిచయమై టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది.

Anushka Shetty About her Marriage
Anushka Shetty About her Marriage

వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత యంగ్ హీరో ప్రభాస్‌తో అనుష్క డేటింగ్ చేస్తోందని, ఆయనతో పెళ్లి కూడా కన్ఫమ్ అయిందనే వార్తలు జోరుగా వినిపించాయి. దీనిని ఇద్ద‌రు ఖండించారు. కొద్ది రోజుల క్రితం టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది.

నిశ్శబ్దం సినిమాతో మరోసారి వెండితెరపై మెరిసిన అనుష్కకు ఆశించిన ఫలితం రాలేదు. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేశ్‌ చెప్పిన ఒక కథ అనుష్కకు నచ్చినా కూడా.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి పూర్తిగా ఖాళీ అయిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. దాంతో అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో మరోసారి వార్తలు మొదలయ్యాయి.

అనుష్క గురించి బాగా తెలిసిన ఒక గురూజీ.. జేజమ్మ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుష్క తన వృత్తిలో చాలా సిన్సియర్ గా ఉంటుందని.. అలాగే ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేద‌ని స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు. క‌చ్చితంగా బయట వ్యక్తినే అనుష్క పెళ్లి చేసుకుంటారని.. 2023 లోపు ఈమె పెళ్లి జరుగుతుంది అంటూ గురూజీ తెలిపారు. మరి ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.