Anushka Sharma: అనుష్క చేతికి ఉన్న వాచ్ ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

Anushka Sharma: సెల‌బ్రిటీలు ధ‌రించే ప్రాప‌ర్టీస్ ఖ‌రీదు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొంద‌రు కాస్ట్ లీ డ్రెస్‌లు ధ‌రిస్తే , మరొ కొంద‌రు కాస్ట్ లీ బ్యాగ్స్ , ఇంకొంద‌రు కాస్ట్ లీ జ్యువ‌ల‌రీ ధ‌రిస్తుంటారు. ఒక్కోసారి వాటి ఖ‌రీదుకి సంబంధించిన వార్త‌లు బ‌య‌ట‌కు రాగా, అది తెలుసుకొని అవాక్క‌వుతుంటారు అభిమానులు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ చేతికి ఉన్న వాచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంంది.

Anushka Sharma

అనుష్క శ‌ర్మ ఈ ఏడాది మొద‌ట్లో వామిక అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. విరాట్, అనుష్క‌ల పేర్లు క‌లిసేలా ఈ పేరు పెట్ట‌గా వామిక అంటే దుర్గామాత అని కోహ్లీ ఓ సంద‌ర్భంలో చెప్పారు. జీరో సినిమా త‌ర్వాత సినిమాల‌కు పూర్తి దూరంగా ఉన్న అనుష్క ఇంటికే ప‌రిమితం అయింది. ఇప్పుడు కొత్త ప‌ర్స‌న్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమె బాగోగులు చూసుకుంటూ కాలం గ‌డుపుతుంది అనుష్క.

ఆగ‌స్ట్ 5 నుండి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరు ఆరుబ‌య‌ట స‌ర‌దాగా త‌మ చిన్నారితో గ‌డుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, అవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా అనుష్క త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఇందులో స్టైలిష్ హెయిర్ క‌ట్‌తో బ్లాక్‌ అండ్‌ వైట్‌ టాప్‌ ధరించడంతో పాటు చేతికి ఖరీదైన వాచ్‌ను ధరించింది. ఇది నెటిజ‌న్స్ దృష్టిని ఎంత‌గానో ఆక‌ర్షించింది. ఈ వాచ్ ఖ‌రీదు ఎంత అని ఆరా తీస్తే మ‌న క‌రెన్సీలో దాదాపు 50 ల‌క్ష‌లు అని తేలింది. అనుష్క పెట్టుకున్న వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కాగా, దాని ధర 65,879 డాలర్లు ఉంటుంద‌ట‌.

Anushka Sharma

ఇంత ఖ‌రీదైన వాచ్ అనుష్క చేతికి ఉండ‌డం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అయితే కొంద‌రు నెటిజన్స్ ఖ‌రీదైన వాచ్ పెట్టావు కాని మాస్క్ ఎక్క‌డ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా త‌న కూతురు వామిక ఆరో నెల వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హించి వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే టీమిండియా స‌భ్యుడు పంత్‌కు క‌రోనా సోకింద‌ని తాజాగా వార్త‌లు రాగా, జ‌ట్టులో క‌లవ‌రం మొద‌లైంది. టీం స‌భ్యుల‌తో పాటు వారి కుటుంబానికి కూడా వైర‌స్ సోకే అవకాశం ఉంది కాబ‌ట్టి అభిమానులు క‌ల‌వ‌ర చెందుతున్నారు. విరాట్ దంప‌తులు మాత్రం వామిక కోస‌మైన చాలా జాగ్ర‌త్త‌గా ఉంటూ వ‌స్తున్నారు.