ANUSHKA: అవ‌మానాల‌ను ఎదుర్కొన్న విరాట్ భార్య‌.. తాజాగా వెల్లడించి షాక్‌కు గురి చేసిన అనుష్క‌

సినీ ప‌రిశ్ర‌మ అనేది ఓ రంగుల ప్ర‌పంచం. ఇందులో అన్ని ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు ప్రేమ‌, అస‌హ్యం, ఆవేద‌న‌, ఆందోళ‌న ఇలాంటివ‌న్నీ చ‌వి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే కెరీర్ తొలి నాళ్ల‌ల్లో ఎన్నో ఇబ్బందులు ప‌డి స్వ‌యంశ‌క్తితో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి స్టార్స్ చాలా మంది మొద‌ట్లో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. ప‌రిస్థితుల‌ని బ‌ట్టి ఒక్కొక్క‌రు ఒక్కోలా స్పందిస్తూ వ‌స్తున్నారు. తాజాగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ త‌న జీవితంలో ఎదురైన అవ‌మానాలను గురించి వివ‌రించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అనుష్క శ‌ర్మ మే 1న 33వ ప‌డిలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అనుష్క బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న భ‌ర్త విరాట్ కోహ్లీతో పాటు క‌రీన్ క‌పూర్, సోన‌మ్ కపూర్ ఇత‌ర సెల‌బ్రిటీలు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే క‌రోనా సంక్షోభం వ‌ల‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌కు దూరంగా ఉన్న అనుష్క శ‌ర్మ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. ‘రబ్‌ నే బనాదీ జోడీ’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనుష్క తన మొదటి చిత్రంతోనే ఏకంగా సూపర్‌ స్టార్‌ షారుక్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.ఈ సినిమా త‌ర్వాత ప‌లు ఛాన్స్ లు అందుకునేందుకు అనుష్క చాలా అవ‌మానాలు ఎదుర్కొంద‌ట‌

కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు మోడ‌లింగ్‌పై అమితాస‌క్తి ఉండేది. అందంగా లేక‌పోయిన‌, స‌న్న‌గా నాజుగ్గా ఉండ‌డం వ‌ల‌నే ఆ అవ‌కాశం వ‌చ్చింది. నీలో హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ లేవ‌ని ప‌లువురు కామెంట్స్ చేశారు.అవి నన్ను ఎంతో బాధించాయి అని అనుష్క పేర్కొంది. అలాగే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కుతుందని భావించి ఆ వేడుకకి వెళితే.. తీరా ఆ అవార్డుకు కూడా నోచుకోలేదు. ఆ స‌మ‌యంలో నేను ప‌డ్డ బాధ అంతా ఇంతా కాదు. స్టేజ్ వెన‌క్కు వెళ్లి ఏడుస్తుంటే అమితాబ్ చూసి నన్ను ఓదార్చారు. ర‌బ్ దే బనాది జోడిలో మీ న‌ట‌న బాగుంది అని ఆయ‌న చెప్ప‌డంతో చాలా సంతోషించాను.ఇలా నా జీవితంలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాను అని అనుష్క పేర్కొంది. 2017 డిసెంబరులో విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వామిక అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే.

Advertisement