Anushka Sharma: గ్రీన్ క‌ల‌ర్ బికినీలో రచ్చ చేసిన అనుష్క‌.. భ‌ర్త కామెంట్ ఏంటంటే..!

Anushka Sharma: ప్రతీ భార్యా తన జీవితాన్ని ‘తల్లి అవ్వక ముందు’, ‘తల్లి అయ్యాక’ అన్నట్టుగా విభజించుకుని చూసుకుంటుంది. ఇందుకు గ్లామర్ ప్రపంచంలో మునిగితేలే కథానాయికలు కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ ప్ర‌స్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది.

TheNewsQube-
Anushka Sharma bikini pics viral
Anushka Sharma bikini pics viral

ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన అనుష్క గత జనవరిలో ఓ అందాల పాపాయికి తల్లి కూడా అయింది. గారాల వారసురాలు ‘వామికా’ జన్మించాక, తన జీవితంలో ఎన్నో మార్పులు కలిగాయంటోన్న ఆమె, వ్యక్తిగా కూడా మానసిక స్థాయిలో ఎంతో పరిణతి చెందానని చెప్పింది.

ఇటీవల దుబాయ్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి భార్య అనుష్కశర్మ, కూతురు వామికను కూడా తీసుకెళ్లాడు. దుబాయ్‌ నుంచి తిరిగొచ్చేముందు విరుష్క జంట అక్కడ సరదాగా కుటుంబంతో గడిపారు. తాజాగా ఆ ఫోటోలను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. వాట‌ర్‌లో గ్రీన్ కలర్ బికినీలో ఫోజు ఇచ్చిన ఫోటోను పోస్టు చేశారు.

Image

ఇందులో అనుష్క హాట్‌గా మెరిసిపోతున్నారు. అయితే ఈ ఫోటోకు అనుష్క భర్త విరాట్ కోహ్లి లవ్‌ హార్ట్‌ ఎమోజీని జత చేశారు. కాగా విరుష్క జంట 2017లో వైవాహిక బంధంలోకి అడుగపెట్టారు. వీరి వివాహ వేడుకకు ఇటలీ వేదిక అయ్యింది. ఈ ఏడాది జనవరిలో వీరి ప్రేమకు గుర్తుగా కూతురు వామిక జన్మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు కూతురి ఫేస్ రివీల్ చేయ‌లేదు.

ఇక అనుష్క చివరిసారిగా జీరో సినిమాలో కనిపించింది. పెళ్లైనప్పటి నుంచి దాదాపు సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పెళ్లై నాలుగేళ్లు అవుతున్న ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాను ఓకే చేయలేదు.

Image