Anushka Sharma: కూతురి తొలి ఫొటో షేర్ చేస్తూ పేరు రివీల్ చేసిన అనుష్క‌శ‌ర్మ‌

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ జ‌న‌వ‌రి 11న పండంటి బేబికు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘మాకు పాప జన్మించిందనే విషయాన్ని పంచుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నా. మీ ప్రేమకు, ప్రార్థనలకు, అభినందనలకు కృతజ్ఞతలు చెబుతున్నాం’ అని కోహ్లీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. అలానే కూతురి ప్రైవ‌సీని గౌర‌వించి ఎవ‌రు ఫొటోలు తీయోద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. కోహ్లీ కూతురిని ఎప్పుడు ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో అనుష్క శ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసి కూతురి పేరు వామిక అని పెట్టిన‌ట్టు తెలియ‌జేసింది.

తాజాగా కూతురు బార‌సాల వేడుక జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌లో త‌మ కూతురిని ఎత్తుకొని ప‌లు ఫొటోల‌కు ఫోజులిచ్చారు కోహ్లీ దంప‌తులు. అయితే కూతురి ఫేస్ రివీల్ కాకుండా ఫొటో పోస్ట్ చేసిన అనుష్క‌..మేం ఇద్ద‌రం ప్రేమ‌, గౌర‌వం, ఉనికితో క‌లిసి బ‌తికాం. వామిక మా ప్రేమ‌ను మ‌రో స్థాయికి చేర్చింది. న‌వ్వు, క‌న్నీళ్ళు, ఆనందం అన్నీ కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలో అనుభూతి చెందుతాం అని అనుష్క పేర్కొంది. అనుష్క శ‌ర్మ పోస్ట్‌ని బ‌ట్టి చూస్తుంటే విరుష్క దంప‌తులు కూతురి రాక‌తో త‌మ లైఫ్‌ని మ‌రింత సంతోషంగా గ‌డుపుతున్న‌ట్టు తెలుస్తుంది.

2017లో అనుష్క శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ దంప‌తుల‌కు పెళ్లి కాగా, గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. త‌న భార్య గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో తొలి టెస్టు ముగియగానే ఆస్ట్రేలియా పర్యటన నుంచి పితృత్వ సెలవులపై కోహ్లీ భారత్‌కు తిరిగివచ్చాడు. అప్ప‌టి నుండి అనుష్క ఆల‌న‌పాల‌న చూసుకుంటూ వ‌స్తున్నాడు. శ్రీమ‌తితో యోగ‌స‌నాలు చేయిస్తూ అన్నివేళ‌లా ఆమెను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌చ్చాడు. కోహ్లీ దంప‌తుల‌కు కూతురు జ‌న్మించింద‌నే వార్త ప్ర‌తి ఒక్క‌రిని ఆనందానికి గురి చేసింది. మ‌రి కొద్దిరోజుల‌లో ఇంగ్లండ్‌తో సిరీస్ మొద‌లు కానుండ‌గా, ఈ మ్యాచ్ కోసం కోహ్లీ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇందులో భాగంగా క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక అనుష్క కొన్నాళ్ళ వ‌ర‌కు సినిమాల‌కు దూరంగా ఉండ‌నుంది. చివ‌రిగా జీరో సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.

Advertisement