ANUSHKA: దుబాయ్ సేట్‌ను పెళ్లాడ‌నున్న అనుష్క‌.. వైర‌ల్‌గా మారిన వార్త‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క వివాహం గురించి కొన్నాళ్లుగా గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌భాస్‌ని చేసుకోనుంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తే, మ‌రి కొంద‌రు బిజినెస్‌మెన్‌ను వివాహ‌మాడ‌నున్న‌ట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. దీంట్లో ఎంత క్లారిటీ ఉంద‌నే దానిపై ఏ మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. అయితే ప్ర‌భాస్‌తో పెళ్లి అని వార్త‌లు వ‌చ్చిన స‌మ‌యంలో అనుష్క స్పందిస్తూ తామిద్ద‌రం స్నేహితులం మాత్ర‌మే అని స్ప‌ష్ట‌త ఇచ్చింది. కాగా, అనుష్క పెళ్లి మ‌రోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.

అందాల భామ అనుష్క‌కు పెళ్లి కుదిరింద‌ని, ఆమె దుబాయ్‌కు చెందిన పెద్ద బిజినెస్‌మెన్ కుమారుడు, త‌నకంటే చిన్న‌వాడైన వ్యక్తిని పెళ్లాడ‌నున్న‌ట్టు టాక్. ఇప్ప‌టికే పెళ్లి గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, క‌రోనా పరిస్థితులు స‌ద్దుమ‌ణిగాక వారిద్ద‌రికి ఇరు కుటుంబ స‌భ్యులు గ్రాండ్‌గా పెళ్లి జ‌రిపించ‌నున్నార‌ని తెలుస్తుంది . అయితే ఇది నిజమా? కాదా? అన్నది అనుష్కనే ధృవీకరించాల్సి ఉంది. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల నిశ్శ‌బ్ధం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అనుష్క త్వ‌ర‌లో న‌వీన్ పోలిశెట్టితో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ట‌. తన కంటే తక్కువ వయసున్న కుర్రాడితో ప్రేమాయణం సాగించే అమ్మాయి కథ అన్న పాయింట్‌తో మూవీ రూపొంద‌నుంద‌ని స‌మాచారం.

Advertisement