Anushka: అ! డైరెక్ట‌ర్‌ని హ‌గ్ చేసుకున్న తొలి అమ్మాయి అనుష్క‌నేన‌ట‌..!

Anushka: సాధార‌ణంగా అమ్మాయి హ‌గ్ ఇస్తే కొంద‌రు దానిని తీపి జ్ఞాప‌కంగా గుర్తుంచుకుంటారు. అదే హీరోయిన్ ఇస్తే ఇంకేమైన ఉంటుందా, ఊహాలోకంలో విహ‌రించడం ఖాయం. అలా అ! ద‌ర్శ‌కుడికి ఓ టాప్ హీరోయిన్ హ‌గా ఇవ్వ‌డంతో ఆ జ్ఞాప‌కాన్ని ప‌దిలంగా దాచుకున్నాడు. తాజాగా ఆ హీరోయిన్ ఇచ్చిన హ‌గ్‌కు సంబంధించిన విష‌యాన్ని ఓ ప్రోగ్రాంలొ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వ‌ర్మ‌.

‘అ!’ అనే అద్భుతమైన సినిమాతో త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్ట‌డంతో అంద‌రి దృష్టి ఈ డైరెక్ట‌ర్‌పై ప‌డింది. వ‌రుస‌గా నిర్మాత‌లు ప్రశాంత్ వ‌ర్మ వెన‌క క్యూ క‌ట్టారు. ఈ క్ర‌మంలో త‌న రెండో సినిమాగా రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా చేసి ఆ తర్వాత ‘జాంబి రెడ్డి’ మూవీ రూపొందించారు. జాంబీ నేప‌థ్యంలో తొలిసారి టాలీవుడ్‌లో ఢిఫ‌రెంట్ ప్ర‌య‌త్నం చేసి భేష్ అనిపించుకున్నాడు.

తన డైరెక్షన్‌లో ఓ విభిన్నమైన క్వాలిటీ ఉంటుందని నిరూపించుకున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ప్ర‌స్తుతం హ‌నుమాన్ అనే సినిమా చేస్తుండ‌గా, ఇటీవ‌ల ఈ చిత్ర లాంచింగ్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. త్వ‌ర‌లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. అయితే తరుణ్‌భాస్కర్‌ హోస్ట్‌గా బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన కెరీర్‌కి సంబంధించిన పలు విషయాలు చెప్పారు.

‘అ!’ సినిమాకు గాను ఎవరో పెద్ద హీరోయిన్‌ నుంచి ప్రశంసలు దక్కాయటగా.. అని తరుణ్‌భాస్కర్‌ అడగ్గానే త‌న‌కు అనుష్క హ‌గ్ ఇచ్చిన విష‌యాన్ని తెలియ‌జేశాడు. ‘అ!’ సినిమా ప్రివ్యూ షో చూడడానికి వచ్చినప్పుడు కొన్ని సన్నివేశాలు చూసి తన దగ్గరికి వచ్చి అనుష్క‌ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని కూడా అన్నారు. ఇక సినిమా విడుద‌ల‌య్యాక మ‌ళ్లీ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన అనుష్క హ‌గ్ చేసుకున్నార‌ని తెలియ‌జేశాడు.

తనను హగ్‌ చేసుకున్న మొదటి అమ్మాయి అనుష్కనే అని ప్రశాంత్ వర్మ చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం. ఆ సమయంలో నా కళ్లలో కన్నీళ్లు ఆగలేదని ఆయన స్ప‌ష్టం చేశారు. . తేజ స‌జ్జా హీరోగా రూపొంద‌నున్నఈ చిత్రం ఫిక్ష‌న‌ల్ నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌.