Anushka: అత్యంత దారుణంగా అనుష్క ప‌రిస్థితి..!

Anushka: అనుష్క శెట్టికి ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు లేదనేది కాదనలేని వాస్తవం. బాహుబలికి ముందు వరకు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. ఇప్పుడు అలా చేయడం లేదు. మూడేళ్ళకు ఓ సినిమా చేయడానికి కూడా కష్టం అయిపోయిందిప్పుడు. ఇప్పుడు అంతా అనుష్క శెట్టి అంటే ఆ చరిత్ర మాత్రమే. టాలీవుడ్‌లో ఒకప్పుడు బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ అనుష్క అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిప్పుడు.

అయినా ఇది ఆమె తప్పు కూడా కాదు. ఎందుకంటే మెడిసిన్‌కు కూడా ఏదో ఓ రోజు ఎక్స్‌పైరీ ఉంటుందని అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు.. అనుష్క పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఈ భామ కెరీర్ అలాగే మారిపోయింది. బాహుబలి తర్వాత సినిమాలు ఒప్పుకోవడం కూడా లేదు స్వీటీ. భాగమతి కూడా బాహుబలి కంటే ముందు ఒప్పుకున్నదే. గతేడాది నిశ్శబ్ధం సినిమాతో వచ్చినా కూడా ఓటిటిలో విడుదలైంది. పైగా డిజాస్టర్ కావడంతో కనీసం వచ్చినట్లు కూడా అనుష్క అభిమానులు గుర్తు పెట్టుకోలేదు.

టైటిల్ కు తగ్గట్లుగానే సైలెంట్ గా వచ్చెళ్లిపోయింది. ఇప్పుడు అనుష్క కెరీర్ డైలమాలో పడింది. పైగా ఆమె వయసు కూడా 40కి చేరువైంది. దాంతో స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. కుర్ర హీరోలకు సరిపోయే ఫిజిక్ కాదు ఈమెది. అందుకే అవకాశాల కోసం చూస్తుంది. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

ఒకానొక సమయంలో అనుష్క సినిమాలకు బాగానే మార్కెట్ ఉన్నా ఇప్పుడు మాత్రం అంత సీన్ లేదు. వరస పరాజయాలతో జేజమ్మ మార్కెట్ దారుణంగా పడిపోయింది. త్వరలోనే ఈమె యువీ క్రియేషన్స్ బ్యానర్ లో రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా గురించి ఎన్నో రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ ముందుకు మాత్రం కదలడం లేదు.

ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే టైటిల్ కూడా అనుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ కథ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడంతో ప్రస్తుతానికి యువీ ఈ సినిమాను పక్కనబెట్టినట్లే అని తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే అనుష్క నుంచి 2022లో కూడా సినిమా లేనట్లే.